Tamarind Leaves: చింత ఆకులతో వెంట్రుకలు ఆరోగ్యంగా.. తెల్ల జుట్టుకు చెక్..

Tamarind Leaves: చింత ఆకులతో వెంట్రుకలు ఆరోగ్యంగా.. తెల్ల జుట్టుకు చెక్..
Tamarind Leaves: జుట్టుకు సరైన పోషణతో పాటు సరైన సంరక్షణ కూడా అవసరం. వయసుతో పనిలేకుండా తెల్ల వెంట్రుకలు ప్రతి ఒక్కరినీ బాధిస్తుంటాయి.

Tamarind Leaves: జుట్టుకు సరైన పోషణతో పాటు సరైన సంరక్షణ కూడా అవసరం. వయసుతో పనిలేకుండా తెల్ల వెంట్రుకలు ప్రతి ఒక్కరినీ బాధిస్తుంటాయి. మార్కెట్లో దొరికే రంగుల్లో కెమికల్స్. ఇవి జుట్టుని నిర్జీవంగా చేస్తాయి. మరికొంత మంది హెయిర్ డ్రైగా ఉంటుంది. ఇలాంటి సాధారణ సమస్యలకు చింతచిగురు అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు. చింత ఆకులు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. దీన్ని ఉపయోగించడం ద్వారా జుట్టు కూడా పెరుగుతుంది. అలాగే, ఇది జుట్టు నుండి చుండ్రు, బ్యాక్టీరియా సమస్యలను తొలగిస్తుంది.

చింత ఆకులు జుట్టుకు మెరుపును కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే సమయంలో, ఇది మీ జుట్టు చిట్లడం వంటి సమస్యలను తొలగిస్తుంది. మీకు అలెర్జీ వంటి సమస్యలు ఉంటే ఇటువంటివి ప్రయత్నించకపోవడమే మంచిది.

చింత ఆకుల పేస్ట్ తయారు చేసే విధానం..

ముందుగా చింతపండు ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు అందులో కాస్త పెరుగు మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి.

పేస్ట్ తలకు పట్టించిన తరువాత కొంత సమయం పాటు బాగా మసాజ్ చేయండి.

వేడి నీటిలో టర్కీ టవల్ ముంచి గట్టిగా పిండి దానిని తలకు చుట్టండి. వేడి ఆవిరి జుట్టు కుదుళ్లను గట్టిపరుస్తుంది.

తర్వాత మీ జుట్టును సాధారణ నీటితో కడగాలి.

ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ సమృద్ధిగా ఉండే చింతపండు ఆకులు జుట్టు రాలడం మరియు చిట్లిపోయే సమస్యను తొలగిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో కూడా ఇవి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

సహజమైన కలరింగ్ ఏజెంట్ చింతపండులో ఉంటుంది. ఇది తెల్ల జుట్టు సమస్యలను దూరం చేస్తుంది.

దీనిని తరచుగా ఉపయోగించడం వలన జుట్టు మెరుపును సంతరించుకుంటుంది.

చింత ఆకుల రసంలో కొద్దిగా తేనె కలపండి. తర్వాత దీన్ని మీ జుట్టుకు పట్టించి కొద్ది సేపు ఉంచి కడిగేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తుంది. సిల్కీగా ఉంటుంది.

ఫ్లేవనాయిడ్స్ మరియు పాలీఫెనాల్స్ ఉండటం వల్ల, చింతపండు ఆకులు జుట్టు నాణ్యతను పెంచుతాయి. అంతే కాదు చింతపండు మీ జుట్టును స్ట్రెయిట్ చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story