Tea or Coffee : టీ లేదా కాఫీ... రెండిట్లో ఏది బెస్ట్?

Tea or Coffee : చాలామందికి పొద్దున లేవగానే టీ లేదా కాఫీ పడాల్సిందే... లేకపోతే ఆ రోజు పని ముందుకు సాగదు. లేకపోతే ఎదో మిస్సైన ఫీలింగ్ వస్తుంటుంది. ఇంకొందరైతే ఏకంగా రోజుకు నాలుగైదుసార్లు అయిన టీ లేదా కాఫీ తాగుతుంటారు. అయితే ఆరోగ్యానికి టీ లేదా కాఫీ.. ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఏది ఆరోగ్యానికి మేలు చేస్తోంది అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. వీటి ప్రయోజనాలు, దుష్ప్రభావాల తెలుసుకొని ఏది తీసుకోవాలో నిర్ణయం తీసుకోండి.
నిద్రలేచింది మొదలు నిద్రపోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారు. ప్రతిరోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి. ఇక బ్లాక్ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు. టీ ఎక్కువగా తాగితే కడుపులో అసిడిటీ పెరిగి అల్సర్ రావడానికి అవకాశముంటుంది. టీ ఎక్కువ సార్లు త్రాగే వారికి ఆకలి మందగిస్తుంది. ఎక్కువగా పనిభారంగా ఫీల్ అయ్యేవారు టీ తాగితే బెటర్.. టీ తాగడం వలన శరీరానికి ఉత్సాహం, ఉత్తేజం రెండు కలుగుతాయి.
ఇక డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు వీలైనంత వరకు కాఫీ తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు. ఇంకా కుదిరితే గ్రీన్ టీ తాగితే బెటర్ అంటున్నారు. టీ, కాఫీలలో కెఫీన్ అనే సమ్మేళనం అనేది కామన్.. రెండిట్లో 400 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. ఇంతకు మించితే అనారోగ్య సమస్యలు వస్తాయి. మోతాదులో తీసుకుంటేనే మంచింది. టీ తో పోల్చితే కాఫీ చాలా ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది. కొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి. రాత్రి పూట భోజనం మితంగా తీసుకుని ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు నడుం కూడా సన్నబడుతుందట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com