Tea with Snacks: టీ తాగుతూ తినకూడనివి ఏంటో తెలుసా..

Tea with Snacks: పొగలు కక్కే వేడి వేడి టీతో పాటు క్రంచీ క్రంచీగా ఉండే స్నాక్స్ ఏవైనా తింటే ఆహా ఆ మజానే వేరు కదా.. బిస్కట్స్, రస్కులు లాంటివి తీసుకుంటే పర్లేదు. కొన్ని తినకూడని పదార్థాలు కూడా ఉంటాయి.. వాటి గురించి తెలుసుకుందాం..
ఉదయాన్నే ఓ మంచి స్ట్రాంగ్ టీతో డే ప్రారంభమైతే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అందరూ ఇష్టపడే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో టీ ఒకటి. బిస్కెట్లు, సమోసాలు, పకోరాలు, నమ్కీన్, ఇంకా బోలెడు రకాల స్నాక్స్ మీ టీ రుచిని మరింత పెంచుతాయి. అయితే వివిధ రకాల ఆహార పదార్థాలతో కూడిన టీని తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను చూపుతాయని అనేకమంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, మీ టీతో ఎప్పుడూ తినకూడని ఆహారాల జాబితాను గురించి తెలుసుకుందాము.
1. గ్రీన్ వెజిటబుల్స్
పచ్చి కూరగాయలు తింటే టీ తాగే అలవాటు ఉంటే మానేయడం మంచిది. టీలో టానిన్లు, ఆక్సలేట్లు అనే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఇనుము శోషణను నిరోధించగలవు. ఆకుపచ్చ కూరగాయలను టీతో కలపడం వల్ల కూరగాయల నుంచి వచ్చే ఐరన్ శరీరానికి అందదు.
2. బేసన్/ శనగపిండి
నమ్‌కీన్, పకోరస్ వంటి బేసన్‌తో చేసిన స్నాక్స్‌తో టీతో తీసుకోవడం చాలా మందికి ఇష్టం. అయితే ఈ ఆహార కలయిక అనేక జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా ఆమ్లత్వం అధికమై కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది.
3. నిమ్మకాయ
నిమ్మరసం గుండెల్లో మంటను తీవ్రతరం చేస్తుంది. ఇది వికారం, కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.
4. పసుపు
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అయినప్పటికీ, టీ మరియు పసుపులో ఉండే రసాయన మూలకాలు జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తాయి. కాబట్టి టీ తీసుకునేటప్పుడు పసుపు జోడించిన పదార్థాలు తినకపోవడమే మంచిది.
5. నట్స్
టీతో పాటు నట్స్‌ను తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం చూపుతుంది. టీలో ఉండే టానిన్ సమ్మేళనం గింజలతో పాటు తీసుకున్నప్పుడు పోషకాలను గ్రహించడాన్ని అడ్డుకుంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com