Weight Control: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ప్రతిరోజు..

Weight Control: ప్రతిరోజూ 10వేల అడుగులు. ఆరోగ్యానికి నడక అత్యుత్తమమైన వ్యాయామం అని అందరికీ డాక్టర్ చెప్పే ఓ మంచి వ్యాయామం. అవును ఆరోగ్యానికి అడుగులు మంచివే.. అయితే బరువు తగ్గాలనకునే వారు కచ్చితంగా 10 వేల అడుగులు పైనే వేయాలంటున్నారు నిపుణులు. ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో నడక సహాయపడుతుందా లేదా అనేదానిపై ప్రశ్నలు తలెత్తాయి.
నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. రోజుకు 8,600 అడుగులు వేయడం వలన బరువు పెరగడాన్ని నిరోధించడంలో సహాయపడుతుందని పేర్కొంది. ఇప్పటికే అధిక బరువు ఉన్న వ్యక్తులు తమ బరువు సగానికి తగ్గించుకోవడానికి రోజుకు 11,000 అడుగులు నడవవచ్చని పేర్కొంది.
అధ్యయనం కోసం, పరిశోధకులు నాలుగు సంవత్సరాల పాటు 6,000 మంది వ్యక్తులను పరిశీలించారు. డిప్రెషన్, డయాబెటిస్ మరియు హైపర్‌టెన్షన్ వంటి ఇతర పరిస్థితులను నివారించడానికి కూడా నడక సహాయపడుతుందని విశ్లేషణ కనుగొంది. "ఊబకాయం అనేది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రధాన ప్రమాద కారకం అని సీనియర్ డయాబెటాలజిస్ట్ డయాబెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి డాక్టర్ అనిల్ భోరస్కర్ అన్నారు.
"మీరు ఏది తిన్నా అది శక్తిగా మారి శరీరం వినియోగించుకుంటుంది. అధిక కేలరీలు కొవ్వుగా మారుతాయి. యువకులకు 1,600 కేలరీలు అవసరం అయితే చిన్న పిల్లలకు 2,000 కేలరీలు ఎదుగుదలకు అవసరం, "అని ఆయన చెప్పారు.
బరువు తగ్గాలంటే మీరు తినే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయాలి. ఇది గుండె జబ్బులు, మధుమేహం, పక్షవాతం, అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి మరియు కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. "మీరు రోజుకు ఎన్ని అడుగులు వేయగలరో నిర్ధారించుకోండి. ఆపై మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ప్రతి వారం 1,000 అడుగుల చొప్పున పెంచండి.
రోజుకు 10వేల అడుగుల వేసే దశకు చేరుకున్న తర్వాత దాన్ని మళ్లీ పెంచండి. కొన్ని వారాల తర్వాత అడుగుల సంఖ్యను మరింత పెంచండి. 11వేల అడుగులు వేయడం అలవాటు చేసుకోండి. అనారోగ్యం దరిచేరదు. అరోగ్యంగా ఉంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com