Weight Loss Tips: అధిక బరువును తగ్గించే పండ్లు ఇవే..
Weight Loss Tips: ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వెంటాడుతున్న సమస్య అధిక బరువు. బరువు ఎక్కువగా ఉన్నా నష్టమే.. తక్కువగా ఉన్నా నష్టమే.. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ వయసుకు తగినట్టుగా బరువును మెయింటేయిన్ చేయగలగాలి. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నవారు జిమ్‌లాంటి వాటికి వెళ్తూ కష్టపడి బరువును కంట్రోల్ చేసుకోవాలనుకుంటారు. కానీ దానికోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు.
మన ఇంట్లో వండే ఆహార పదార్థాలు, బయట నేచురల్‌గా పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు.. ఇవి చాలు ఓ మనిషిని ఆరోగ్యంగా ఉండడానికి. బరువు విషయంలో కూడా ఎక్కువగా ఇవే మనిషికి సహాయపడతాయి. అందులోనూ పండ్లు అనేవి బరువు తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. ఏ పండ్లు తింటే బరువు తగ్గుతారంటే..
కమలా పండ్లు: వీటిలో ఉండే పీచు పదార్థం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దానికి తోడు విటమిన్ సీ కూడా శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
కివీ పండ్లు: కివీ పండ్లకు మామూలుగా ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం శీతాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లల్లో విటమిన్ సి, ఇ, ఫోలేట్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే కాలెస్ట్రాల్‌ను అదుపు చేసి బరువును తగ్గించడంలో ఈ పండ్లు సహాయపడతాయి.
అరటి పండ్లు: మిగతా పండ్లతో పోలిస్తే అరటిపండ్లను మాత్రం ఎక్కువగా కొనగోలు చేస్తుంటారు చాలామంది. అయితే వీటి వల్ల కూడా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండడంతో ఇవి తిన్న తర్వాత చాలాసేపటి వరకు ఆకలి వేయదు. పైగా వాటిలోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి.
ఆపిల్ పండ్లు: ఈ పండ్లు తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఆపిల్స్‌లో మామూలుగానే నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు తరచూ తినడంవల్ల కూడా సులువుగా బరువు తగ్గవచ్చు.
పుచ్చ పండ్లు: ఆపిల్స్ లాగానే ఈ పండ్లలో కూడా ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. పైగా ఈ పండ్లలో కేలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒంట్లోని కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
బెర్రీ పండ్లు: యాంటీ ఇన్‌ఫ్లామేటరీ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండే బెర్రీస్‌ని తీసుకోవడంవల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో పాటు బరువు కూడా తగ్గుతుంది.
ద్రాక్ష పండ్లు: నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లలో ద్రాక్ష ఒకటి కాబట్టి ఈ పండ్లు కూడా శరీర బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com