Drugs: డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు.. కోమాలోకి వెళ్లడంతో పాటు..

Drugs: డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు.. కోమాలోకి వెళ్లడంతో పాటు..
Drugs: డ్రగ్స్‌ వాడితే తాత్కాలికంగా కిక్కు ఉండొచ్చేమో కానీ.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు

Drugs: డ్రగ్స్‌ వాడితే తాత్కాలికంగా కిక్కు ఉండొచ్చేమో కానీ.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. హెరాయిన్‌కు బ్లాక్‌ట్రా, చివా, నెగ్రా, హార్స్‌ అంటూ మారు పేర్లు ఉన్నాయి. వీటిని కరిగించి ఇంజెక్షన్‌లా తీసుకోవడం, ముక్కుతో పీల్చడం, సిగరెట్‌లో నింపుకొని కాల్చడం చేస్తారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులతోపాటు కోమాలోకి వెళ్లి మరణించే ప్రమాదం ఉంటుంది.

కొకైన్‌కు స్టఫ్, కోకి, ఫ్లాకీ, స్నో, కోకా, సోడా అనే మారుపేర్లతో పిలుస్తారు. వీటిని ముక్కుతో పీల్చడం, సిగరెట్‌లో నింపుకొని కాల్చడం, వైన్‌లో కలుపుకుని తాగడం చేస్తారు. దీనివల్ల నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్, గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ.

గాంజా, చెరస్, హష్‌ ఆయిల్‌ను ఓ మాల్‌గా పిలుస్తుంటారు. గంజాయి ఆకులను సిగరెట్‌లో నింపుకొని కాలుస్తారు. గంజాయి చెట్టు నుంచి కారే బంక నుంచి చెరస్‌ ఉత్పత్తి అవుతుంది. దాన్ని నేరుగా తీసుకోవడం లేదా సిగరెట్‌ ద్వారా సేవిస్తారు. వీటితో ఊపిరితిత్తులు, మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story