Skin Glowing Fruits: చర్మం కాంతివంతంగా మారడానికి ఉపయోగపడే అయిదు ఫ్రూట్స్..

Skin Glowing Fruits: చర్మం కాంతివంతంగా మారడానికి ఉపయోగపడే అయిదు ఫ్రూట్స్..
Skin Glowing Fruits: ఫ్రూట్స్‌ అనేవి ఎక్కువగా శరీర సౌందర్యానికి ఉపయోగపడతాయని బ్యూటీషియన్స్ అంటున్నారు.

Skin Glowing Fruits: ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్యానికి కూడా సరైన ఫుడ్ డైట్ ముఖ్యం. కొన్ని రకమైన ఆహార పదార్థాలు తింటే చర్మంలో కాంతి వస్తుంది. కొన్నిటి వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. కొన్నిటి కారణంగా మచ్చలు తొలగిపోతాయి. ఇలా రకరకాల ఆహార పదార్థాల వల్ల ఎన్నో విధాలుగా సౌందర్యానికి మేలు కలుగుతూనే ఉంటుంది.

పండ్లు ఇష్టపడేవారు చాలా తక్కువమందే ఉంటారు. రెగ్యులర్‌గా పండ్లు తినడం అలవాటు అయిన వారి సంఖ్య తక్కువే. అయితే ఫ్రూట్స్‌ అనేవి ఎక్కువగా శరీర సౌందర్యానికి ఉపయోగపడతాయని బ్యూటీషియన్స్ అంటున్నారు. అందుకే కాస్మిటిక్స్ కూడా ఎక్కువగా ఫ్రూట్స్‌తోనే తయారవుతాయి అంటున్నారు. అయితే ఈ ప్రొడక్ట్స్‌ను మొహానికి పూసుకోకపోయినా.. ఫ్రూట్స్ తినడం వల్ల కూడా చర్మానికి అవే రకమైన లాభాలు ఉంటాయని వారు చెప్తున్నారు. అవేంటంటే..

1. టమాటో

టమాటోలో విటమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మోటిమల సమస్యలు తగ్గుతాయి. టమాటో అనేది ఎప్పటికప్పుడు ఎండ నుండి చర్మాన్ని కాపాడుతుంది. ఎండకు చర్మం పాడవ్వకుండా టమాటో ఉపయోగపడుతుంది.


2. ఆరెంజ్

మామూలుగా అందరూ ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ చాలావాటిలో ఆరెంజ్ ఉంటుంది. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడమే కాదు.. ఆరెంజ్ ఫ్రూట్స్‌ను తిన్నా కూడా చర్మాం అందంగా ఉంటుంది. ఆరెంజ్‌లో ఎక్కువగా విటమిన్ సి ఉండడం వల్ల చర్మం డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.


3. అవోకాడో

అవోకాడోలు చాలా టేస్టీగా ఉండడం వల్ల చాలామంది వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే ఇవి టేస్ట్‌ను మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని కూడా అందిస్తాయి. ఇందులో మినరల్స్, ఫ్యాట్స్‌లాంటివి చాలా ఉంటాయి. అవి చర్మానికి చాలా మంచిది. అంతేకాకుండా అవోకాడోలో చర్మాన్ని కాపాడే విటమిన్ సి, విటమిన్ ఈ కూడా ఉంటాయి.


4. పుచ్చకాయ

పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. మొత్తం పుచ్చకాయలో 95 శాతం నీరే ఉంటుంది. అందుకే ఇది శరీరాన్ని డీ హైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి, లైకోపీన్, విటమిన్ ఏ వంటివి ఉండడం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.


5. దానిమ్మ

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి పొడిచర్మాన్ని దూరం చేస్తుంది. అంతే కాకుండా దానిమ్మ వల్ల ట్యాన్ అయిన స్కిన్ కూడా మళ్లీ కాంతివంతంగా మారుతుంది.



Tags

Read MoreRead Less
Next Story