స్త్రీలలో వచ్చే అండాశయ క్యాన్సర్.. రెండు ముఖ్య సంకేతాలు

స్త్రీలలో వచ్చే అండాశయ క్యాన్సర్.. రెండు ముఖ్య సంకేతాలు
ఎంత అడ్వాన్స్ మెడిసిన్ వచ్చినా క్యాన్సర్ పేరు వింటేనే ఒకలాంటి భయం ప్రతి ఒక్కరిలో చోటు చేసుకుంటుంది..

ఎంత అడ్వాన్స్ మెడిసిన్ వచ్చినా క్యాన్సర్ పేరు వింటేనే ఒకలాంటి భయం ప్రతి ఒక్కరిలో చోటు చేసుకుంటుంది.. మారిన జీవన శైలి మనిషిని అనేక రోగాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే అండాశయ క్యాన్సర్‌ని గుర్తించేందుకు రెండు ప్రమాదకరమైన సంకేతాలను సూచించింది బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్. దీర్ఘకాలం మలబద్ధకం లేదా విరేచనాలతో బాధపడుతుంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. అశ్రద్ధ చేస్తే అది అండాశయ క్యాన్సర్‌కి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వ్యాధి కారణంగా బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం 4000 మందికి పైగా మహిళలు మరణిస్తున్నారు. ఇది సైలెంట్ కిల్లర్, దీని లక్షణాలను మొదట్లో గుర్తించడం కష్టం. వ్యాధి ముదిరినప్పుడు అండాశయ క్యాన్సర్ లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ శరీరంలో జరిగే మార్పుల గురించి తెలుసుకోవాలని, వాటిని అస్సలు విస్మరించకూడదని హెచ్చరిస్తున్నారు.

క్యాన్సర్ రీసెర్చ్ UK ప్రకారం, క్యాన్సర్ పెద్దప్రేగుకు వ్యాపించినప్పుడు జీర్ణ సమస్యలు సంభవించవచ్చు. అండాశయ క్యాన్సర్ ఆరవ అత్యంత సాధారణ క్యాన్సర్ అని రీసెర్చ్ తెలిపింది. ప్రతి సంవత్సరం 7500 కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

అండాశయ క్యాన్సర్ ఎక్కువగా 75 ఏళ్లు అంతకంటే పైబడిన మహిళల్లో కనిపిస్తుందని సంస్థ తెలిపింది. అండాశయ క్యాన్సర్ లక్షణాలలో అధిక మూత్రవిసర్జన కూడా ఒకటి. ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళలు తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.

అండాశయ క్యాన్సర్ యొక్క లక్షణాలు

1. త్రేన్పులు రావడం

2. ఆకలి లేకపోవడం

3. పొత్తికడుపు నొప్పి

4. కడుపు ఉబ్బరం

5. తరచుగా యూరిన్‌కి వెళ్లాలని అనిపించడం

6. అలసట

7. ఆకస్మిక బరువు

పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలతో చాలా కాలం నుంచి బాధపడుతుంటే, వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకోవాలి. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన మహిళలు ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ఎందుకంటే 50 ఏళ్లు పైబడిన మహిళలు మెనోపాజ్‌ దశలో ఉంటారు. అందుకే వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

గమనిక: ఇది నెట్‌లో దొరికిన సమాచారం. మీ ఫ్యామిలీ వైద్యుడికి ఇది ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.. మీ వైద్యుడి సూచనలు పాటించడం మంచిది.

Tags

Read MoreRead Less
Next Story