Hair Care: పరగడుపున ఇవి తీసుకుంటే.. పొడవైన జుట్టు..

Hair Care: పరగడుపున ఇవి తీసుకుంటే.. పొడవైన జుట్టు..
Hair Care: జీవన శైలి, పోషకాహార లోపం, పొల్యూషన్ జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు.

Hair Care: జీవన శైలి, పోషకాహార లోపం, పొల్యూషన్ జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారిపోయింది వెంట్రుకలు రాలడం అనేది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ప్రతి రోజు ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవడం అలావాటు చేసుకోవాలి. అవేంటో చూద్దాం..

కరివేపాకు: కరివేపాకులో ఉండే విటమిన్ సి, ఐరన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కాబట్టి వెంట్రుకలకు కరివేపాకును ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ప్రతిరోజూ 3 నుండి 4 ఆకులను ఖాళీ కడుపుతో నమలడం వల్ల కొన్ని రోజుల తర్వాత జుట్టు పెరుగుదలలో తేడా కనిపించడం ప్రారంభమవుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

అవిశె గింజలు లేదా లిన్ సీడ్ గింజలు: జుట్టుకు అత్యంత అవసరమైన ఒమేగా-3 అవిశె గింజల్లో పుష్కలంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, ఖాళీ కడుపుతో అవిశె గింజలను తీసుకోవాలి.

వేప ఆకులు: వేప సహజ ఔషధం. వేప ఆకులు పొట్టకే కాకుండా జుట్టుకు కూడా మేలు చేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయని చెబుతారు.

కొబ్బరి నీరు: ఇది ఒక గొప్ప ఆరోగ్యకరమైన పానీయం. ఇది జుట్టు, చర్మం, పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టుకు బలం చేకూరుతుంది.

సిట్రస్ పండ్లు: విటమిన్ సి పుష్కలంగా ఉన్న సిట్రస్ పండ్లు జుట్టు పెరుగుదలకు, వెంట్రుకల కుదుళ్లు గట్టిపడడానికి దోహదపడుతుంది. వారానికి మూడు సార్లు ఖాళీ కడుపుతో పుల్లని పండ్ల రసాన్ని త్రాగడం ఉత్తమం.

Tags

Read MoreRead Less
Next Story