Eggs: గుడ్డుతో ఇవి కలిపి తింటున్నారా.. చాలా డేంజర్ సుమా!!

Eggs: గుడ్డుతో ఇవి కలిపి తింటున్నారా.. చాలా డేంజర్ సుమా!!
Eggs: ఉదయాన్నే హడావిడిగా ఓ ఎగ్, దానికి తోడు మరొకటి తింటే సరిపోతుందని ఏదో ఒకటి తినేస్తుంటారు.

Eggs: గుడ్డు శరీరానికి శక్తిని ఇచ్చే పోషకాహారం.. రోజుకి ఒక గుడ్డు తింటే శరీరానికి కావలసిన ప్రొటీన్ అంది ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని పోషకాహార నిపుణులు సెలవిస్తుంటారు. అయితే ఉదయాన్నే హడావిడిగా ఓ ఎగ్, దానికి తోడు మరొకటి తింటే సరిపోతుందని ఏదో ఒకటి తినేస్తుంటారు. కానీ కొన్ని ఆహార పదార్ధాలు ఎగ్‌తో కలిపి అస్సలు తినకూడదని చెబుతున్నారు.

చెడు ఆహార కలయిక మానవ శరీరానికి చాలా హానికరం. కాబట్టి, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా కీలకం. కొన్ని ఆహార కలయికలు జీర్ణవ్యవస్థకు సమస్యలను కలిగిస్తాయి. ఇది వికారం, ప్రేగు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.

గుడ్లు పోషకాలకు ప్రసిద్ధి. ఇందులో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో నిండిన గుడ్డు చాలా వంటకాలు చేయడానికి ఉపయోగించబడుతుంది.

కొందరు గుడ్డు మాత్రమే తింటే, మరికొందరు వాటిని మాంసం, పాల ఉత్పత్తులు, కెఫిన్ పానీయాలతో కలిపి తింటారు. కానీ, గుడ్లతో కలిపి తీసుకోకూడని ఆహారాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం.

గుడ్లతో తినకూడని కొన్ని ఆహార పదార్ధాలు..

చక్కెర: గుడ్లను చక్కెరతో కలిపి ఎప్పుడూ తినవద్దు. ఇది అమైనో ఆమ్లాలను విడుదల చేస్తుంది. దాంతో శరీరం విషపూరితం. ఇది రక్తంలో గడ్డలు ఏర్పడడానికి దారి తీస్తుంది.

సోయా పాలు: సోయా పాలతో గుడ్లు తినడం వల్ల మీ శరీరంలో ప్రోటీన్ శోషణకు ఆటంకం కలుగుతుంది.

టీ: టీ తాగిన వెంటనే గుడ్డు తినకూడదు. ఇది మలబద్దకానికి కారణమవుతుంది. ఇది మీ శరీరానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

చేపలు: గుడ్లు, చేపలను ఎప్పుడూ కలిసి తినకూడదు. ఇది అలర్జీకి కారణం అవుతుంది.

పనీర్: చేపలాగే, పనీర్‌తో గుడ్లు కలిపి తినడం వల్ల అలర్జీతో పాటు శరీరంలో ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.

అరటిపండు: గుడ్లు తిన్న తర్వాత ఎప్పుడూ అరటిపండు తినకూడదు. ముఖ్యంగా, జిమ్‌కు వెళ్లేవారు గుడ్లు, అరటిపండ్లు కలిపి తీసుకుంటారు. ఇది శరీరానికి చాలా హానికరం. అందుకే గుడ్డు తిన్న ఓ గంట వరకు మరే ఆహార పదార్ధం తీసుకోకపోవడం ఉత్తమం.

Tags

Next Story