Hair Fall Solution : జుట్టు రాలే సమస్యకు చక్కటి పరిష్కారం..

Hair Fall Solution : మహిళల్లో జుట్టు రాలడం పెద్ద సమస్యగా ఉంటుంది. ఓ సర్వేను బట్టి సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే ప్రతీ రోజు 100 నుంచి 150 వెంట్రుకలు రాలే అవకాశం ఉన్నట్లు చర్మవైద్య నిపుణురాలు చెబుతున్నారు.
కొందరు మహిళలు జుట్టు రాలడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. మార్కెట్లో విచ్చలవిడిగా దొరికే కెమికల్స్ వాడడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య మరింత పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలుతుందని ఈ మధ్య ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ సమస్యను చాలా సులువుగా ఎలా పరిష్కరించాలనే విషయాలను డెర్మటాలజిస్ట్ తెలియజేశారు.
జుట్టు రాలే సమస్యను మందులతో కాకుండా సాధారణంగా పరిష్కరించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
కొందరు మహిళలు చాలా టైట్ గా పోనిటేల్ వేసుకుంటారు, దాని వల్ల వెంట్రుకలకు ఫ్రిక్శన్ ఏర్పడి సమస్య తెలెత్తవచ్చు.
మార్కెట్లో దొరికే కెమికల్స్ ఎక్కువగా వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ వెంట్రుకలకు మంచి అనిపించే షాంపూలను, కండీషనర్లను మాత్రమే వాడండి.
కంటినిండా నిద్ర, వత్తిడిని తగ్గించుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com