Health Tips: మీరు ఎక్కువగా కూర్చుంటున్నారా..? అయితే..

Health Tips (tv5news.in)

Health Tips (tv5news.in)

Health Tips: 20 ఏళ్ల వయసు నుండి ఆరోగ్యం పైన శ్రద్ధ పెడితేనే ఎక్కువగా ఆరోగ్య సమస్యలకు లోనవకుండా ఉండగలుగుతాం.

Health Tips: 20 ఏళ్ల వయసు నుండి ఆరోగ్యం పైన శ్రద్ధ పెడితేనే మధ్య వయసు వచ్చేవరకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలకు లోనవకుండా ఉండగలుగుతాం. ఈరోజుల్లో ఆరోగ్య సమస్యలకు వయసుతో సంబంధం ఉండట్లేదు. 30 దాటింది అంటే మనిషి జీవితానికే గ్యారెంటీ లేకుండా పోతుంది. అందుకే యవ్వనం నుండే ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

ఈ జెనరేషన్ ఎక్కువగా కంప్యూటర్ పనుల్లో బిజీ అయిపోయి హెల్త్‌ను నిర్లక్షం చేస్తున్నారన్న కొందరి వాదన చాలావరకు నిజమే. అమెరికాలో చేసిన ఓ స్టడీ ప్రకారం.. టీనేజ్ పిల్లలు రోజుకు దాదాపు 8.2 గంటలు కూర్చుని ఉండగా 20 ఏళ్ల వయసువారు దాదాపు 6.4 గంటలు కూర్చుని ఉంటున్నారు. ఇవి మామూలుగా రోజుకు మనం కూర్చోవాల్సిన మోతాదు సమయం కంటే ఎక్కువగా వైద్యులు పరిగణిస్తున్నారు.

శారీరికంగా ధృడంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. కేవలం ఆహార పదార్థాలు, వ్యాయామాలుపైనే దృష్టిపెట్టడం కాదు.. మానసిక ఆరోగ్యం కూడా శారీరిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈకాలంలో యూత్‌పై ఫ్యామిలీ ప్రెజర్, వర్క్ ప్రెజర్ ఎక్కువవుతున్నాయి. దాని వల్ల వారు మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. దీని కోసం యువకులు పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రొటీన్‌ను సమపాళ్లలో తీసుకోవడం మంచిది. చికెన్, పనీర్ లాంటి ఆహార పదార్థాలు మన శరీరంలో ప్రొటీన్‌ను పెంపొందించడానికి సహాయపడతాయి. అలాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం ధృడంగా ఉంటుంది. ముఖ్యంగా శారీరికంగా, మానసికంగా ఎక్కువ ఒత్తిడి తీసుకుంటున్న యువకులు ప్రొటీన్ ఆహారాన్ని అసలు మిస్ అవ్వద్దు.

20 ఏళ్ల వయసు ఉన్న వారు ఇప్పుడు ఏం తింటున్నారు అన్నదాన్ని బట్టే భవిష్యత్తులో వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది నిర్ణయించబడుతుంది. అందుకే వారికి ప్రొటీన్‌తో పాటు క్యాల్షియమ్ కూడా ముఖ్యమే. క్యాల్షియమ్ వల్ల బోన్స్‌కు శక్తి వస్తుంది కాబట్టి క్యాల్షియమ్ ఉన్న ఆహారం ఎంత తీసుకుంటే అది 60 ఏళ్లు వచ్చేవరకు బోన్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచడానికి అంత ఉపయోగపడుతుంది. ఆకు కూరలు, సంత్రాలు, బ్రోకోలి, పాలు లాంటి పలు ఆహార పదార్థాల్లో క్యాల్షియమ్ ఎక్కువగా ఉంటుంది.

ఇప్పటి బిజీ జీవితాల్లో అందరూ రేస్‌లలో పరిగెడుతున్నవారే. అది వారి హార్మోన్లపై కూడా నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా యువతులలో హార్మోన్ల సమస్య వల్ల అనేక సమస్యలు తెలెత్తుతాయి. పీసీఓల్లాంటి సమస్యలు కూడా హార్మోన్ల వల్లే వస్తుంది. అందుకే హార్మోన్లను బ్యాలెన్స్ చేసుకోవాలంటే బ్లూ బెర్రీస్, వాల్‌నట్స్, ఓట్స్ లాంటివి తీసుకోవడం మేలు.

ఐరన్ లోపం అనేది ఈ మధ్య ఎక్కువగా యువతులలో కనిపిస్తున్న సమస్య. ముఖ్యంగా మెన్స్‌ట్రువల్ సైకిల్ అప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. లేకపోతే అమ్నీషియా, ఫాటిగ్ లాంటి సమస్యలు వస్తాయి. శరీరంలో ఐరన్ మోతాదును పెంచాలంటే బీన్స్, గుడ్డు సొన, చికెన్ లివర్, ఆల్మండ్స్ లాంటివి తినడం మంచిది.

Tags

Read MoreRead Less
Next Story