TIPS FOR GOOD SLEEP: నిద్ర పట్టట్లేదా..? ఇవి ట్రై చేయండి..!

TIPS FOR GOOD SLEEP: నిద్ర పట్టట్లేదా..? ఇవి ట్రై చేయండి..!
TIPS FOR GOOD SLEEP: ప్రశాంతంగా నిద్రపోవడం ఈ రోజుల్లో అంత సులభం కాదు. మంచి నిద్రకు పోయేందుకు ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి

ప్రశాంతంగా నిద్రపోవడం ఈ రోజుల్లో అంత సులభం కాదు. మారుతున్న కాలంతో పోటీపడి పరుగులు పెడుతున్న మనిషికి కంటినిండా నిద్ర చాలా అవసరం. హాయిగా నిద్ర పోయిన రోజున మనం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం. అయితే మనలో చాలా మందికి సరిగ్గా నిద్రపట్టదు. నిద్రలేమి సమస్యతో ఎంతో మంది బాధపడుతుంటారు. తెల్లవార్లు నిద్రపట్టక సతమతమవుతుంటారు. దీని దుష్ప్రభావం రోజంతా ఉంటుంది. ఈ సమస్య అలాగే కొనసాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. నిద్రలేమివల్ల గుండెకు సంబంధించిన జబ్బులతో పాటు మనిషిలోని డీఎన్‌ఏ పాడవుతుందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. నిజానికి ప్రతి ముగ్గురిలో ఒకరు నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు. అందులోనూ మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండటానికి ఈ చిన్న చిన్న చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి.



రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యి గోరు వెచ్చగా చేసుకుని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా నిద్ర పట్టే అవకాశాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అలాగే గసగసాల్ని దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రపోయే టైంలో వాసన పీలుస్తూ ఉండాలి. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తల వెంట్రుకల్ని మృదువుగా దువ్వుతూ లేదా చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేసినా నిద్ర పడుతుంది. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మర్దనా చేసుకున్నా మంచి నిద్ర పడుతుంది. రాత్రి పూట గోరు వెచ్చని పాలు..మిరియాల పౌడర్ కలుపుకుని తాగినా ఇట్టే నిద్రపడుతుంది.


రాత్రి పడుకునేముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం పూర్తిగా మానేయాలి. స్లో వాల్యూమ్‎లో నేచర్ మ్యూజిక్ వింటూ ప్రశాంతంగా కళ్లు మూసుకుంటే నిద్ర దానంతటదే పడుతుంది.

మంచి నిద్ర పట్టాలంటే ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. జాజికాయ, బాదం, యాలకులను దంచి పాలలో కలుపుకొని తాగినా నిద్ర పడుతుంది. పడుకునే ముందు రోజూ గోరువెచ్చని పాలల్లో ఓ స్పూన్ తేనె వేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. రెగ్యులర్‌గా ఈ పాలు తాగడం వల్ల మెల్లగా నిద్రలోకి జారుకోవచ్చు. తేనెలో ట్రిప్టోపాన్ ఉంటుంది. ఇది శరీరంలోని సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఈ కారణంగా శరీరంలో హార్మోన్లు ప్రేరేపితమవుతాయి. ఈ కారణంగా హాయిగా నిద్రపోవచ్చు.

మెలటోనిన్ సమృద్ధిగా ఉండే చెర్రీలు తింటే వెంటనే నిద్రపడుతుంది. నిద్రించడానికి ముందు కొన్ని చెర్రీ పండ్లను తినడం వల్ల హ్యాపీగా నిద్రపోవచ్చు. వీటిని నేరుగా తీసుకోవచ్చు లేదా జ్యూస్‌లా తాగినా చక్కని ఫలితం ఉంటుంది. మెగ్నీషియం అధికంగా ఉండే బాదం తినడం వల్ల కూడా హాయిగా నిద్రపడుతుంది. నిద్రిస్తున్న సమయంలో రక్తంలోని చక్కెరస్థాయిని నియంత్రించడంలో బాదం ఎంతగానో సాయపడుతుంది.


నిద్రపోవడానికి ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఈ కారణంగా హ్యాపీగా నిద్రపడుతుంది. శ్వాససంబంధమైన యోగా, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల మంచి నిద్ర సొంతమవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story