శీతాకాలంలో హెయిర్ ఫాల్.. అరికట్టేందుకు నిపుణులు సూచించిన మార్గాలు

శీతాకాలంలో హెయిర్ ఫాల్.. అరికట్టేందుకు నిపుణులు సూచించిన మార్గాలు
రోజుకు 100 నుండి 150 వెంట్రుకలు కోల్పోవడం సాధారణం కాబట్టి భయపడవద్దు.

జుట్టు సంరక్షణలో మొదటి దశ ఆహారం.. మనం తినే ఆహారంలో రెండు ముఖ్యమైన విషయాలు ఐరన్, ప్రోటీన్. జుట్టు కణాలు శరీరంలో వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. ఆహారంలో ఆకు కూరలు, చేపలు, సోయాబీన్స్, తృణధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. రోజూ 12 మి.గ్రా ఐరన్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా ప్రోటీన్ కూడా అవసరం. ఎందుకంటే ఇది జుట్టును బలపరుస్తుంది. జున్ను, పాలు, సోయా, కాయధాన్యాలు, బఠానీలు, పెరుగు వంటి అమైనో ఆమ్లాలు అధికంగా ఆహారంలో చేర్చాలి.

ఆరోగ్యకరమైన జుట్టుకోసం కొన్ని ప్రాథమిక చిట్కాలు..

1. రోజుకు 100 నుండి 150 వెంట్రుకలు కోల్పోవడం సాధారణం కాబట్టి భయపడవద్దు.

2. తడి జుట్టును వీలైనంత వరకు దువ్వకుండా ఉంటేనే మంచిది. పూర్తిగా ఆరిన తరువాతే వెడల్పు పళ్లు ఉన్న దువ్వెనతో ముందు దువ్వి ఆ తరువాత మామూలు దువ్వెనతో దువ్వుకోవాలి.

3. చివరలను తరచుగా కత్తిరించండి. అప్పుడే పెరిగే అవకాశం ఉంటుంది.

4.వారానికి రెండు సార్లు తల స్నానం చెయ్యాలి. ఉపయోగించే షాంపూ, కండీషనర్ ఒకే బ్రాండ్‌వి ఉండేలా చూసుకోండి.5. మీ జుట్టు ఎండిపోతున్నట్లు అనిపిస్తే, సల్ఫేట్ లేని షాంపూని ప్రయత్నించండి.

7. నిమ్మకాయ, తేనె మంచి హెయిర్ లైట్నెర్స్ గా పనిచేస్తాయి.

8.పెరుగులో డీప్ కండిషనింగ్ ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది, పెరుగు జుట్టు యొక్క నాణ్యత, బలాన్ని తిరిగి పొందడానికి సహాయపడుతుంది. వారానికి ఒకసారి రెండు కప్పుల పెరుగు తీసుకొని జుట్టు అంతా పట్టించాలి. సుమారు 20 నుండి 30 నిమిషాలు ఉంచండి. తరువాత మంచి షాంపూతో శుభ్రంగా కడగాలి, ఆపై కండీషనర్ అప్లై చేయాలి.

9. గుడ్డుతో చికిత్స.. జుట్టుకు మంచి కండిషనర్‌లా ఉంటాయి గుడ్లు. గుడ్డు పచ్చసొన జుట్టుకు పట్టించాలి. ఇలా 15 నిమిషాలు ఉంచండి, ఆపై మంచి షాంపూతో కడగాలి. దీంతో మీ జుట్టుకు మంచి షైన్ వస్తుంది.

10. అలోవెరా, తేనె వాడకం.. అలోవెరా జుట్టుకు మంచి ఏజెంట్‌గాను, కండీషనర్‌గాను పని చేస్తుంది. జుట్టుకు షైన్ ఇవ్వడానికి తేనె కూడా అద్భుతమైనది. ఒక గిన్నెలో అలోవెరా, తేనె, మంచి కండీషనర్ సమాన మొత్తంలో కలపి జుట్టుకు అప్లై చేయాలి. 5 నుండి 10 నిమిషాలు ఉంచుకున్న తరువాత మంచి షాంపూతో కడగాలి.

11. కొబ్బరి నూనె మసాజ్.. కొబ్బరి నూనె జుట్టుకు అవసరమైన పోషకాహారాన్ని అందిస్తుంది. పొడి జుట్టుకు కొబ్బరి నూనెను గోరు వెచ్చగా చేసి తలకు అప్లై చేయాలి. సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఇప్పుడు, మంచి షాంపూతో కడిగి తరువాత కండీషనర్ అప్లై చేయాలి.

12. హనీ.. తేనె జుట్టును తేమగా, షైన్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. ఒక కప్పు తేనె తీసుకొని కప్పు నీటితో కలపండి. తడి జుట్టు మీద ఈ మిశ్రమాన్ని రాయాలి. సుమారు 15 నిమిషాలు ఉంచుకుని మంచి షాంపూతో కడగాలి.

13.శీతాకాలపు జుట్టు సంరక్షణ: సూర్యరశ్మి, కాలుష్యం, వర్షపు నీరు, ధూళికి ఎక్కువగా గురికాకుండా మీ జుట్టును రక్షించండి. ఇది జుట్టును పొడిగా, పెళుసుగా మారుస్తుంది. కాబట్టి, జుట్టును సాధ్యమైనంతవరకు రక్షించడానికి ప్రయత్నించండి. వర్షానికి తడిస్తే అదే రోజు కడగడం తప్పనిసరి.

పై చిట్కాలు పాటిస్తూ ప్రోటీన్ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. అలాగే, బ్లీచింగ్, డైయింగ్, కర్లింగ్ లేదా స్ట్రెయిటెనింగ్ వంటి హీట్ ట్రీట్మెంట్స్ వంటి వాటిని నివారించడానికి ప్రయత్నించండి. మీ జుట్టుకు చేసే చికిత్సలు వీలైనంత సహజంగా ఉండేలా చూసుకోండి.

Tags

Read MoreRead Less
Next Story