శీతాకాలంలో మెరుగైన రోగనిరోధక శక్తి కోసం ఈ యోగా ఆసనాలు..

ఇమ్యూనిటీ (రోగనిరోధకశక్తి )తక్కువగా ఉన్నవాళ్లు కొంచెం చలిగాలి తగిలినా హచ్, హచ్ అంటూ తుమ్ముతుంటారు. ఆహారంతో పాటు కొన్ని యోగాకు సంబంధించిన ఆసనాలు కూడా వేస్తే ఫలితం ఉంటుంది. బయటకు వాకింగ్ కు వెళ్లలేని వారు ఇంట్లోనే ఈ ఆసనాలు వేయొచ్చు.
ఈ శీతాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని యోగా ఆసనాలను చూద్దాం. వాటిని ఎలా వేయాలో కూడా తెలుసుకుందాం.
యోగా మన రోగనిరోధక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. యోగాను క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తే ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఈ కారకాలు బలమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తాయి.
యోగాలో సున్నితమైన కదలికలు, దీర్ఘ శ్వాస ఇవన్నీ ఒత్తిడిని తగ్గించడానికి, ప్రశాంతతను పెంపొందించడానికి సహాయపడతాయి.
ఈ భంగిమలు రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి.
చలికాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి యోగా ఆసనాలు:
1. తాడాసన
మీ భుజాలకు సమానమైన దూరంలో మీ కాళ్ళను ఉంచి నిటారుగా నిలబడండి
మీ రెండు అరచేతి వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి తల పైభాగానికి తీసుకురండి.
మీ చేతులను వీలైనంత వరకు సాగదీయండి
ఈ స్ట్రెచ్‌లో 10 అంకెలు లెక్కపెట్టండి. ఈ విధంగా 3 నుంచి 5 సార్లు చేయండి. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకు వెళ్లండి. 10 అంకెలు లెక్కపెట్టిన తరువాత శ్వాస వదులుతూ చేతులను కిందకు తీసుకు రండి.
2. ఉష్ట్రాసనం
ముందుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్లపై లేవండి.
చేతులు పైకెత్తి మీ కాలి మడమలను పట్టుకోవడానికి ప్రయత్నించాలి.
ఈ సమయంలో, మీ ముఖం పైకప్పును చూస్తున్నట్లుగా ఉండాలి
10-20 అంకెలు లెక్కపెట్టండి. 3 నుంచి 5 సార్లు చేయండి ఈ ఆసనాన్ని.
3. సేతు బంధాసనం
నిటారుగా పడుకుని కాళ్లను మడిచి తుంటి దగ్గరకు తీసుకురావాలి.
ఇప్పుడు చేతులతో కాలి మడమలను పట్టుకుని వెన్నుపూసను పైకి లేపాలి.
ఈ సమయంలో కాళ్లు హిప్-వెడల్పు వేరుగా ఉండాలి
శ్వాస తీసుకుంటూ మీ తుంటిని పైకి లేపడానికి, మీ తుంటిని బిగించడానికి ప్రయత్నించండి
శ్వాస తీసకుకుంటూ పైకి, తర్వాత సాధారణ స్థితికి తిరిగి రండి.
4. ధనురాసనం
మీ పొట్టపై పడుకోండి, మీ చేతులను మీ వైపులా మరియు మీ కాళ్ళను నిటారుగా ఉంచండి
మీ మోకాళ్లను వెనుకకు వంచేటప్పుడు మీ పాదాలను మీ పిరుదులకు వీలైనంత దగ్గరగా తీసుకురండి
మీ వెనుక చేయితో మీ చీలమండలను సున్నితంగా పట్టుకోండి
మీ తుంటి మరియు మోకాళ్లు ఒకే స్థలంలో ఉన్నాయని నిర్ధారించుకోండి
మీరు మీ పాదాలను దగ్గరగా లాగేటప్పుడు మీ తొడలను నేల నుండి కొంచెం పైకి ఎత్తండి
మీ తల, ఛాతీ రెండింటినీ ఒకే సమయంలో ఎత్తండి
శ్వాస తీసుకుంటూ ఆసనంలోకి వెళ్లాలి. శ్వాస వదులుతూ ఆసనం నుంచి బయటకు రావాలి. ఇలా ఆసనంలో 10 అంకెలు లెక్కపెట్టి ఉండడానికి ప్రయత్నించండి.
5. శవాసన
యోగా మ్యాట్ మీద కాళ్లు చేతులు దూరంగా చాపి పడుకోండి.
మీ అరచేతులు తెరిచి ఉంచండి. అరచేతులు ఆకాశం వైపు ఉండాలి
మీ కాళ్లు మీ భుజాల కంటే కొంచెం దూరంగా ఉండాలి
ఈ సమయంలో, ఊపిరి పీల్చుకోండి
యోగా మాత్రమే అనారోగ్యాన్ని పూర్తిగా నిరోధించదు. రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం ముఖ్యం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com