Turmeric Water: పసుపు పాలే కాదు పసుపు నీళ్లు కూడా ప్రయోజనకరం.. రోగనిరోధక శక్తికి..

Turmeric Water: పసుపు పాలే కాదు పసుపు నీళ్లలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి. పసుపు పాలలాగే నీరు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దాని ఇతర ఆరోగ్య ప్రయోజనాలను గూర్చి తెలుసుకుందాం..
పసుపు ఆరోగ్య ప్రయోజనాలు: పసుపులో కర్కుమిన్ అని పిలువబడే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని కణాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
పసుపును ఆయుర్వేద శాస్త్రంలో సంజీవని అంటారు. పసుపులో ఉన్న ఔషధ గుణాల కారణంగా వంటల్లో విరివిగా వాడతారు. ఇది ఔషధ మొక్క. రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. ఇది మన శరీరంలోని అనేక రుగ్మతలను కూడా దూరం చేస్తుంది.
పసుపు చర్మానికి మేలు చేస్తుంది. చాలా మంది జలుబు , దగ్గు వంటి స్వల్ప కాలిక వ్యాధులు వచ్చినప్పుడు వేడి పాలలో పసుపు వేసుకుని తాగమని సలహా ఇస్తుంటారు.. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పాలలో పసుపు కలుపుతుంటారు. కానీ పసుపు పాలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయో, పసుపు నీరు కూడా మీ శరీరానికి అంతే మేలు చేస్తుంది.
పసుపు నీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. పసుపు నీటిని తయారు చేయడానికి తాజా పసుపు పొడిని ఉపయోగించవచ్చు.
మీ శరీరంలోని ప్రభావిత ప్రాంతంలో తరచుగా నొప్పి ఉంటే, పసుపు నీరు త్రాగటం మీకు ఉత్తమమైనది. పసుపు నీటిలో లభించే యాంటీఆక్సిడెంట్లు విషాన్ని నాశనం చేస్తాయి. నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి.
చర్మానికి మేలు చేస్తుంది
మీరు పసుపుతో కూడిన నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే, అది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ చర్మంపై ఏవైనా మృతకణాలు ఉంటే, అవి తొలగి మీ చర్మం సహజంగా మెరుస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మారిన జీవనశైలి కారణంగా చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆపై అసిడిటీ, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో వైద్యుడిని సంప్రదించాల్పి వస్తుంది. కానీ కొన్ని హోం రెమెడీస్ సహాయంతో, మీరు మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందులో పసుపు నీళ్లు కూడా ఒకటి. మరీ ఎక్కువ మొత్తంలో కాకుండా ఒక కప్పు నీటిలో చిటికెడు స్వచ్ఛమైన పసుపు వేసుకుని తాగితే సరిపోతుంది..
గమనిక: ఇది వైద్యుల ఔషధాలకు ప్రత్యామ్నాయం కాదు.. కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది.. ఇంటి వైద్యాన్ని అవలంభించే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్ ని సంప్రదించి మొదలు పెట్టాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com