uses of sodium carbonate: సోడియం కార్బోనేట్‌తో ఎన్ని ఉపయోగాలో..

uses of sodium carbonate: బేకింగ్ సోడా వంటకి ఎలా ఉపయోగిస్తారో అలాగే ఇంటి పనుల కోసం అంటే ఇల్లు క్లీన్ చేయడానికి, సింక్ శుభ్రం చేయడానికి ఇలా వివిధ రకాల పనులకు సోడియం కార్బోనేట్ ఉపయోగించవచ్చు. ఫ్లోర్ క్లీన్ చేసేందుకు, బాత్‌రూమ్ శుభ్రం చేసేందుకు సోడియం కార్బోనేట్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇంటి ఫ్లోర్ మెరిసేందుకు..
రెండు లీటర్ల వేడినీటిలో 2 - 3 టీ స్పూన్ల సోడియం కార్బోనేట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి రెండు టీ స్పూన్ల వెనిగర్ కూడా జోడించవచ్చు. ఇప్పుడు మిశ్రమాన్ని నేలపై పోసి కొద్ది సేపు అలాగే ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత స్క్రబ్బర్‌తో క్లీన్ చేయాలి. దీంతో నేల మెరుస్తుంది.

డ్రెయిన్ సమస్యను తొలగించుకునేందుకు..
డ్రెయిన్ సమస్యను అధిగమించేందుకు సోడియం కార్బోనేట్ ఉత్తమ పరిష్కారం. బాత్‌రూమ్ సింక్, బాత్‌రూమ్ డ్రెయిన్, కిచెన్ సింక్ తదితర ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఉపయోగించవచ్చు. దీని కోసం నాలుగు టీస్పూన్ల సోడియం కార్బోనేట్ రెండు లీటర్ల వేడి నీటిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి 4 చెంచాల నిమ్మరసం జోడించాలి. ఈ మిశ్రమాన్ని డ్రైన్‌పై బాగా పిచికారీ చేయాలి. 10 నిమిషాల తరువాత శుభ్రంగా క్లీన్ చేయాలి. ఇలా వారానికి వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన ఫలితం ఉంటుంది. సింక్ మెరుస్తుంది.

ఇనుప అలమారాలు, కిటికీలు, కుర్చీలు మొదలైన వాటి తుప్పును సులభంగా తొలగించేందుకు సోడియం కార్బోనేట్ ఒక గొప్ప ఎంపిక. ముందుగా చేతులకు గ్లౌజులు వేసుకుని ఒక టీస్పూన్ సోడియం కార్బోనేట్‌లో ఉప్పు, సున్నం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తుప్పు పట్టిన ప్రదేశంలో అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి.
10 నిమిషాల తర్వాత స్క్రబ్ చేయండి. సోడియం కార్బోనేట్, నిమ్మకాయ మిశ్రమం కూడా తుప్పుని సులభంగా తొలగిస్తుంది. బట్టల పై పడిన మరకలను కూడా సోడియం కార్బొనేట్‌తో సులభంగా తొలగించవచ్చు. మొక్కలకు చీడ పడితే సోడియం కార్బొనేట్ కలిపిన నీళ్లను పిచికారీ చేయడం ద్వారా వాటికి పట్టిన తెగుళ్లను నివారించవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com