టాయిలెట్‌లో కూడా ఫోన్ వాడకం.. కోరి అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లే..

టాయిలెట్‌లో కూడా ఫోన్ వాడకం.. కోరి అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లే..
చాలా మంది బాత్రూమ్ లో సమయం గడపడానికి మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తారు.

చాలా మంది బాత్రూమ్ లో సమయం గడపడానికి మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తారు.బాత్‌రూమ్‌లో ఫోన్‌ను ఉపయోగించడం వల్ల తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రచయితలు, కథకులు బాత్రూమ్‌లోనే తమకు ఆలోచనలు వస్తాయని భావిస్తారు. ఆ మేరకు అక్కడే చర్చలు నడిపిస్తుంటారు. మరికొంత మంది బాత్రూంలో కూర్చుని మ్యాగజైన్‌లు చదువుతారు.

చాలా మంది బాత్రూమ్ గాయకులు కూడా ఈ ప్రదేశం అనువైనదిగా భావిస్తారు. మొబైల్ ఫోన్లు వచ్చిన తరువాత బాత్‌రూమ్‌లో కూర్చుని బాతాఖానీ వేసే వారి సంఖ్య ఎక్కువైంది. టాయిలెట్‌లో కూర్చుని మొబైల్‌లో స్క్రోలింగ్ చేయడం లేదా ఫోన్‌లో మాట్లాడుతూ తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాన్నమని భావిస్తే, అది పూర్తిగా తప్పు. ఎందుకంటే టాయిలెట్‌లో కూర్చొని ఫోన్ ఉపయోగించడం మీ ఆరోగ్యానికి చాలా హానికరం.

నిజానికి టాయిలెట్లో ఫోన్ ఉపయోగించడం చాలా ప్రమాదకరం. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. టాయిలెట్‌లో ఫోన్ ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసుకోండి-

పైల్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ

టాయిలెట్లో కూర్చొని ఫోన్ వాడటం వల్ల సాధారణంగా పైల్స్ అని పిలవబడే హెమరాయిడ్స్ వచ్చే ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. Hemorrhoids చాలా బాధాకరమైనది. వీటి నుంచి కొన్నిసార్లు రక్తస్రావం కూడా సంభవిస్తుంది. సాధారణంగా పురీషనాళంలోని సిరల్లో ఏర్పడే రుగ్మతను 'వేరికోస్ వెయిన్స్' అంటారు. ఇది పురీషనాళం లోపల లేదా పాయువు వెలుపల కూడా సంభవించవచ్చు.

హానికరమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు

ఇల్లు అయినా, ఆఫీసు అయినా, మరుగుదొడ్డిని సాధారణ ప్రదేశంగా పరిగణించరు. ఇక్కడ చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి చోట కూర్చుని గంటల తరబడి ఫోన్ ఉపయోగిస్తే టాయిలెట్ నుంచి వచ్చే హానికరమైన బ్యాక్టీరియా మీ ఫోన్ కు అంటుకుంటుంది. మరియు ఫోన్ ద్వారా, ఈ బ్యాక్టీరియా ముక్కు, చెవులు మరియు కళ్ళ ద్వారా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాంతో వ్యాధులను కోరి తెచ్చుకున్నట్లే.

మంచి అలవాట్లను అలవర్చుకోండి

టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు మీ మొబైల్ ఫోన్‌ను ఎప్పుడూ మీతో తీసుకెళ్లకండి. ఇది మూల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story