refrigerated foods: ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం ఎన్ని గంటల తర్వాత తినకూడదంటే..

refrigerated foods: బిజీ లైఫ్.. ఎవరికీ టైమ్ లేదు.. కూరగాయలు, పండ్లు వారానికి సరిపడా తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటాం .. అవే పది రోజులు ఉంటాయంటే.. మళ్లీ వాటిని వండిన తరువాత, కట్ చేసిన తరువాత కూడా ఫ్రిజ్‌లో పెడుతుంటారు టైమ్ లేక, సాయంత్రం మళ్లీ వండడానికి వీలవక.. ఇది ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు.. ఫ్రిడ్జ్‌లో ఉంచిన కొన్ని ఆహారాలు ఎన్ని గంటల తర్వాత తినకూడదో వివరిస్తున్నారు.
చపాతీ పిండి: చపాతీలు చేయగా మిగిలిందని ఆ పిండిని తీసుకెళ్లి ఫ్రిజ్‌లో పెడతారు.. అయితే దాన్ని 12 నుంచి 14 గంటలలోపు వాడేయడం మంచిదంటున్నారు.
పప్పు: మిగిలిన పప్పుని ఫ్రిజ్‌లో ఉంచితే 1 రోజులలో తినాలట.
బొప్పాయి: ఆరు గంటల్లోపు ఫ్రిజ్‌లో ఉంచిన బొప్పాయిని తినాలి. లేదంటే కలుషితమవుతుందట.
యాపిల్: వారం రోజులలోపు
చెర్రీ: 7 రోజులు
సిట్రస్ ఫ్రూట్స్: వారం రోజులు
పుచ్చకాయ: కట్ చేయకపోతే వారం, కట్ చేస్తే 2 నుంచి 4 రోజుల్లోపు
పైనాపిల్: 5-7 రోజులు
బీన్స్: 3-5 రోజులు
మొక్కజొన్న: 1-2 రోజులు
దోసకాయ: 4-6 రోజులు
వంకాయ: 4-7 రోజులు
పుట్టగొడుగులు: 3-7 రోజులు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com