Vitamin D : శరీరానికి విటమిన్-డి అవసరమే.. కానీ..

Vitamin D : శరీరానికి విటమిన్-డి అవసరమే.. కానీ..

Vitamin D

Vitamin D మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటే అది శరీరానికి చెడు చేస్తుంది.

Vitamin D : అతి అనర్థమని పెద్దలు ఊరికే అనలేదు. మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటే అది శరీరానికి చెడు చేస్తుంది. కెనడాకు చెందిన వ్యక్తి ఇలాగే విటమిన్-డిని ఆహారం ద్వారానే కాకుండా సిరప్ రూపంలో రెండేళ్ల పాటు తీసుకున్నాడు. దాంతో రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. నిజానికి డి-విటమిన్ లోపంతో ఎముకలు బలహీనంగా మారుతాయి. అందుకే డాక్టర్లు పరీక్షల అనంతరం అవసరమైన వారికి వీలైనంత వరకు ఆహారంలో ఉండేటట్లు చూసుకోమంటారు.


అవసరమైతేనే మెడిసన్ రూపంలో తీసుకోమని సలహా ఇస్తుంటారు. కెనడాకు చెందిన ఈ వ్యక్తి మాత్రం సొంత వైద్యం చేసుకున్నాడు. ప్రతి రోజు 12 చుక్కల డి-విటమిన్ సిరప్ తీసుకునేవాడని, ఇది 12000 ఇంటర్నేషనల్ యూనిట్లతో సమానమని వైద్యులు తెలిపారు. శరీరానికి డి-విటమిన్ ఎక్కువ కావడంతో రక్తంలో క్రియాటినిన్ ఎంజైమ్ ఎక్కువవడం ద్వారా కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. విటమిన్-డి సాధారణంగా సూర్యరశ్ని ద్వారా చర్మపు పై పొరలో తయారవుతుంది.

అలాగే సమతులాహారం, పప్పుదినుసులు, కూరగాయలు విరివిగా తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.


డాక్టర్ సూచన లేకుండా ఇష్టం వచ్చినట్లు డి-విటమిన్ తీసుకుంటే కిడ్నీలు చెడిపోతాయని కెనడా మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో రాసుకొచ్చారు. డి-విటమిన్ ఎక్కువైతే అధిక రక్తపోటు, అలసటగా అనిపించడం, తరచూ మూత్ర విసర్జన వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు. రక్తంలో క్యాల్షియం లెవల్స్ ఎక్కువైతే వికారం, వాంతులు, ఆకలి మందగించడం వంటి లక్షణాలన్నీ కలిసి కిడ్నీ సమస్యలకు దారి తీస్తాయి. ఇదే కాదు విటమిన్ సప్లిమెంట్స్ ఏవైనా డాక్టర్ల సూచన మేరకే తీసుకోవాలి.


Tags

Read MoreRead Less
Next Story