వర్షాకాలంలో నీటి వల్ల వచ్చే వ్యాధులు.. గుర్తుంచుకోవలసిన విషయాలు

వర్షాకాలంలో నీటి వల్ల వచ్చే వ్యాధులు.. గుర్తుంచుకోవలసిన విషయాలు
వర్షాకాలంలో నీటి వల్ల రోగాల బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

వర్షాకాలంలో నీటి వల్ల వచ్చే వ్యాధులు.. గుర్తుంచుకోవలసిన విషయాలు

వర్షాకాలంలో నీటి వల్ల రోగాల బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి ఈ వర్షాకాంలో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఏమిటి?

నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కొన్ని రోజులు లేదా వారాలు ఉండవచ్చు. వర్షాకాలంలో నిలిచిపోయిన మురికి నీరు అనేక జీవుల సంతానోత్పత్తికి అనువైనది. ఈ జీవులు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు కారణమవుతాయి.

టైఫాయిడ్

అత్యంత సాధారణ వర్షాకాల వ్యాధులలో టైఫాయిడ్ ఒకటి. కలుషితమైన ఆహారం లేదా అపరిశుభ్రమైన నీటిని తీసుకోవడం ద్వారా టైఫాయిడ్ బారిన పడవచ్చు.

కలరా

నీటి ద్వారా వచ్చే మరొక సాధారణ వ్యాధి కలరా. విరేచనాలు, డీహైడ్రేషన్ వంటి అనేక ఇతర లక్షణాలకు దారితీయవచ్చు. స్వచ్ఛమైన నీరు తాగడం వల్ల కలరాను నివారించవచ్చు.

హెపటైటిస్-ఎ

హెపటైటిస్-ఎ అనేది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది మన కాలేయ ఆరోగ్యంపై దాడి చేస్తుంది. ఇది మురికి నీరు లేదా హెపటైటిస్-ఎతో బాధపడుతున్న వారి నుండి సంక్రమించవచ్చు. ఇది కామెర్లు, వాంతులు, జ్వరం మొదలైన వాటికి కూడా కారణం కావచ్చు.

వర్షాకాలంలో ఈ వ్యాధులను ఎలా నివారించవచ్చు?

1. తరచుగా చేతులు కడుక్కోవాలి

తరచుగా చేతులను కడుక్కోవడం వల్ల ఈ రుగ్మతలకు మూలంగా ఉన్న అనేక జీవులను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ముఖాన్ని తాకడానికి లేదా తినడానికి ముందు కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

2. నీరు నిలువకుండా చూడాలి

నీరు నీలవ వుండడం వలన దోమలు చేరతాయి. దీని వలన అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.

3. మీ శరీరాన్ని దుస్తులతో కప్పిఉంచండి

శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. కాళ్లకు సాక్స్ ధరించాలి. అప్పుడైతేనే దోమలు కుట్టకుండా ఉంటాయి.

4. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వలన ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

5. ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తీసుకోవాలి.

వర్షాకాలంలో ఫిల్టర్ నీరు లేదా కాచిన నీటిని మాత్రమే తాగాలి.

6. తినే భోజనం పట్ల శ్రద్ధ వహించాలి

భోజనం ద్వారా వ్యాధికారక క్రిములు సంక్రమించవచ్చు. మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి మాంసం, కూరగాయలను సరిగా ఉడికించాలి.

8. చల్లని వాతావరణంలో ఆహారాన్ని ఉంచండి

నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల టైఫాయిడ్‌తో సహా అనేక అనారోగ్యాలు వ్యాపించే అవకాశం ఉంది.

9. స్పైసీ ఫుడ్ నుండి దూరంగా ఉండండి

మసాలా వంటలు, పాస్ట్ ఫుడ్ కారణంగా మన జీర్ణాశయం దెబ్బతింటుంది. వీటిని జీర్ణించుకోవడం కష్టమవుతుంది. దాంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యం బారిన పడతారు.

Tags

Read MoreRead Less
Next Story