Jeera Water: జీరా వాటర్.. బరువు తగ్గడానికి, కొవ్వును కరిగించడానికి..

Jeera Water: జీరా వాటర్.. బరువు తగ్గడానికి, కొవ్వును కరిగించడానికి..
Jeera Water: పప్పు, చారు ఏదైనా తాళింపు పెట్టాలంటే జీలకర్ర కచ్చితంగా ఉండాల్సిందే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా. వంట దినుసుల్లో ప్రత్యేకంగా ఉపయోగించే దినుసుల్లో జీలకర్ర ఒకటి..

Jeera Water: పప్పు, చారు ఏదైనా తాళింపు పెట్టాలంటే జీలకర్ర కచ్చితంగా ఉండాల్సిందే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా. వంట దినుసుల్లో ప్రత్యేకంగా ఉపయోగించే దినుసుల్లో జీలకర్ర ఒకటి.. కడుపులో గడబిడగా అనిపించినప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని నమలమని చెబుతుంటారు ఇంట్లోని పెద్దవాళ్లు. జీరా వాటర్ అంటూ ప్రత్యేకంగా విక్రయిస్తుంటారు షాపుల్లో. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది జీలకర్ర.

చాలా మంది ఆరోగ్య నిపుణులు బరువును తగ్గించుకోవడానికి ఇంటి నివారణలను ఉపయోగించాలని సూచిస్తున్నారు. అందులో ఒకటి జీరా వాటర్. జీలకర్రను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టడం వలన అవి ఉబ్బుతాయి. అవి నీటిలోకి అవసరమైన పోషకాలను కూడా విడుదల చేస్తాయి. అప్పుడు ఈ నీరు పసుపు రంగులోకి మారుతుంది.

బరువు తగ్గడానికి జీరా నీరు

జీరా ఆయుర్వేదంలో అంతర్ భాగం. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.

1. కేలరీలు చాలా తక్కువ

ఒక టీస్పూన్ జీలకర్రలో ఏడు కేలరీలు ఉంటాయి. కాబట్టి, మీరు ఒక గ్లాసు జీరా నీటిని నిరభ్యంతరంగా తాగొచ్చు.

2. జీర్ణక్రియలో సహాయపడుతుంది

జీరా నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. ఇది ఎంజైమ్‌లను స్రవిస్తుంది. మంచి జీర్ణవ్యవస్థ బరువు తగ్గడానికి కీలకం. జీర్ణక్రియ జీవక్రియ రేటును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.

3. కొవ్వును కరిగిస్తుంది

జీలకర్ర శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దాంతో బాడీ ఫిట్ గా ఉంటుంది.

4. ఆకలిని అణిచివేస్తుంది

మీరు డైటింగ్ చేస్తున్నప్పుడు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉన్నప్పుడు ఏదైనా తినాలన్న కోరిక సహజం. అయితే, అటువంటి సమయంలో ఏది పడితే అది తినకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి జీరా నీరు ఉత్తమంగా పని చేస్తుంది. ఒక గ్లాసు జీరా నీటిని తాగడం వల్ల మీ పొట్ట నిండుతుంది. మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది, మీరు జంక్ తినకుండా నిరోధిస్తుంది.

5. మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది

జీరా నీరు అన్ని టాక్సిన్స్‌ను బయటకు పంపడం ద్వారా మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, తద్వారా శరీరం కొత్త మరియు ఆరోగ్యకరమైన కణాలను ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడానికి మీరు తప్పనిసరిగా స్వీట్స్ కి, స్వీట్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. జీరా వాటర్‌తో వాటిని భర్తీ చేయాలి.

జీరా వాటర్ ఎలా తయారు చేయాలి?

ఒక టీస్పూన్ జీరాను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి. రాగి పాత్రను ఉపయోగిస్తే ఇంకా మంచిది. రాగి నీళ్లను తాగడం వల్ల కూడా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ అద్భుతమైన పానీయంతో పాటు బరువు తగ్గడానికి వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారం జత చేయాలి.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. నిపుణులైన వైద్యుల అభిప్రాయానికి ఇది ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు.

Tags

Read MoreRead Less
Next Story