weight control without exercise: వ్యాయామం లేకుండా వెయిట్ తగ్గాలంటే.. ఇలా చెయ్యాలి..

weight control without exercise: వ్యాయామం లేకుండా వెయిట్ తగ్గాలంటే.. ఇలా చెయ్యాలి..
weight control without exercise: ఎక్సర్‌సైజ్‌లు చేసే టైమ్ లేదు.. కానీ ఏది చూసినా తినాలనిపిస్తుంది.. కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు.. వెయిట్ పెరిగిపోతున్నామని బాధపడుతుంటారు.

weight control without exercise: ఎక్సర్‌సైజ్‌లు చేసే టైమ్ లేదు.. కానీ ఏది చూసినా తినాలనిపిస్తుంది.. కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు.. వెయిట్ పెరిగిపోతున్నామని బాధపడుతుంటారు. సన్నగా, స్లిమ్‌గా ఉన్నవారిని చూస్తే ఈర్ష్య, తగ్గాలంటే.. తప్పదు.. నోటికి తాళం వేయాల్సిందే.. చిరుతిండ్లకు చెక్ పెట్టాల్సిందే..

వ్యాయామం లేకుండా వేగంగా బరువు తగ్గడానికి 10 చిట్కాలు చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

1. సాప్ట్ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు..

సోడా, ఐస్‌ టీ, స్పోర్ట్స్ డ్రింక్స్ వంటి చక్కెర పానీయాలలో కేలరీలు అధికంగా ఉంటాయి. దాంతో త్వరగా బరువు పెరుగుతారు. ఒక సాధారణ కోకో కోలా డబ్బాలో 140 కేలరీలతో 39 గ్రాముల చక్కెర ఉంటుంది. భోజనానికి ఓ అరగంట ముందు నీరు త్రాగడం వల్ల అధికంగా ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.

2. ఆహారంతో బరువు తగ్గాలనుకుంటే..

కేలరీలు తక్కువ, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

3. ఫైబర్ తీసుకోవడం పెంచండి

కూరగాయలు, పండ్లు, బీన్స్, తృణధాన్యాలు వంటి పోషకాహారాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. పొట్ట నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది.

4. నిద్ర ఎక్కువగా..

నిజమా.. నిద్ర ఎక్కువపోతే బరువు తగ్గుతారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు.

మీ నిద్ర యొక్క నాణ్యత బరువు తగ్గే మీ సామర్థ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, వ్యాయామం లేకుండా వేగంగా బరువు తగ్గాలని చూస్తున్నప్పుడు మీరు చేయగలిగే బెస్ట్ పనేంటంటే బాగా నిద్రపోవడం.

5. అధిక క్యాలరీలు కలిగిన స్నాక్ ఫుడ్‌కి దూరంగా ఉండండి

ఐస్ క్రీంలు, కుకీలు నోరూరించినా వాటి జోలికి అస్సలు వెళ్లకూడదు. వాటికి బదులు గడ్డ కట్టిన పెరుగు తీసుకోండి.

6. లీన్ ప్రోటీన్‌పై డబుల్ డౌన్

లీన్ ప్రోటీన్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి ఇది మీకు త్వరగా ఆకలి వేయకుండా నిరోధిస్తుంది. చికెన్ బ్రెస్ట్, చేపల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. శాఖాహారులైతే.. చీజ్, గుడ్లు వంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

7. ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం..

తరచుగా డైటింగ్ చేసే వ్యక్తులు కొవ్వు సంబంధిత పదార్థాలకు దూరంగా ఉంటారు. అయితే మీ బరువు తగ్గించే డైట్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చాలి. ఇది మీ శరీరానికి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుంది.

అవోకాడో, ఆలివ్ నూనె, పొద్దుతిరుగుడు, చియా, అవిసె గింజలు, కొవ్వు చేపలు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలకు కొన్ని ఉదాహరణలు.

8. నెమ్మదిగా తినండి

భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినడం, నెమ్మదిగా తినడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వలన తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కొవ్వుగా మారే అవకాశం తక్కువగా ఉంటుంది.

9. మనసు పెట్టి ఆస్వాదిస్తూ తినాలి..

మీరు భోజన సమయంలో పరధ్యానంగా ఉండకుండా శ్రద్ధ పెట్టి తినాలి. ఆహారం యొక్క రుచిని ఆస్వాదించాలి.

10. ఇంట్లో వండిన ఆహారం తినండి

ఇంట్లో వండిన ఆహారం తింటే బరువు పెరిగే అవకాశం తక్కువ. బయటి ఆహారాల్లో చీజ్, వెన్న వంటి పదార్థాలు జోడిస్తారు.రుచిగా ఉందని ఎక్కువగా లాగించేస్తుంటారు. దాంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story