weight loss diet: ఎంత మంచి వార్త.. చాక్లెట్‌తో కూడా వెయిట్ కంట్రోల్..

weight loss diet: ఎంత మంచి వార్త.. చాక్లెట్‌తో కూడా వెయిట్ కంట్రోల్..
weight loss diet: ఇష్టమైన ఎన్నో ఆహారాలను కంట్రోల్ చేస్తే కానీ బరువు తగ్గలేమని బాధపడేవారికి ఇది మంచి వార్తే మరి. చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్దవారితో సహా అందరికీ చాక్లెట్ అంటే ఇష్టం ఉంటుంది.

weight loss diet: ఇష్టమైన ఎన్నో ఆహారాలను పక్కనపెడితే కానీ బరువు తగ్గలేమని బాధపడేవారికి ఇది మంచి వార్తే మరి. చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్దవారితో సహా అందరికీ చాక్లెట్ అంటే ఇష్టం ఉంటుంది. ఇక ఓవర్ వెయిట్ ఉన్నవారైతే చాక్లెట్ చూస్తే ఆగలేరు.

బరువు తగ్గాలంటే ఓ భారీ లిస్టే చెబుతారు న్యూట్రీషియన్లు.. అది తినొద్దు ఇది తినొద్దు అని.. ఇక తినమని చెప్పే లిస్ట్ చూస్తే చుక్కలు కనిపిస్తాయి. తప్పదు తగ్గాలి అని బలవంతంగా తింటుంటారు భారీ వ్యక్తులు. మీకోసమే చాక్లెట్ కూడా తినొచ్చని చెబుతున్నారు కొంతమంది అధ్యయనకారులు.. చాలా మంచి విషయం కదా.. అలాగే బరువు తగ్గించుకునే కొన్ని మంచి పదార్థాలను కూడా మీ లిస్ట్‌లో చేర్చుకోండి.. అవేంటో చూద్దాం..

కొన్ని రుచికరమైన ఆహారాలు కూడా మీ మెనూలో చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. కానీ, మీరు ఏమి తినవచ్చో ఖచ్చితంగా తెలియకపోతే శరీరానికి కావలసిన పోషకాలు అందక ఇబ్బంది పడతారు.

బరువు తగ్గించే ఆహారం కోసం 5 ఆశ్చర్యకరమైన ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.

1. చాక్లెట్..


ఆశ్చర్యంగా ఉంది కదూ.. చాక్లెట్ మనలో చాలా మందికి చాలా ఇష్టమైన పదార్ధం. అయితే ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా!? లూసియానా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చాక్లెట్ తినడం వల్ల శరీరానికి కావలసిన మంచి పాలీఫెనోలిక్ సమ్మేళనాల ఉత్పత్తిని పెంచుతుందని కనుగొన్నారు. ఇది వాపు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. శరీరంలో పేరుకొన్న కొవ్వును బర్న్ చేస్తుంది.

2. రెడ్ వైన్..


వైన్ ప్రియులందరికీ ఇది శుభవార్త! న్యూట్రిషన్ రివ్యూలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, రెడ్ వైన్‌లో కనిపించే రెస్వెరాట్రాల్ మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి రెడ్ వైన్ సహాయపడుతుంది. అయితే దీన్ని మితంగా తీసుకోవాలి. అప్పుడే అధిక బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

3. పాప్ కార్న్..


పాప్‌కార్న్‌లో తక్కువ శక్తి సాంద్రత, అధిక మొత్తంలో ఫైబర్, కొన్ని కేలరీలు ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడాన్ని ప్రోత్సహించే ఆహార లక్షణాలు. ఒక కప్పు పాప్‌కార్న్‌లో 31 కేలరీలు ఉంటాయి. ఇది అనేక చిరుతిండ్ల కంటే చాలా తక్కువ.

4. కాఫీ..


మీ జీవక్రియను పెంచడానికి కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది. ఫిజియాలజీ అండ్ బిహేవియర్ జర్నల్‌ జరిపిన పరిశోధనలో కాఫీ తాగేవారి సగటు జీవక్రియ రేటు 16% ఎక్కువగా ఉందని కనుగొన్నారు.

5. ఆవాలు..


ఆవాలు భారతీయ వంటలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన ప్రకారం, ఒక టీస్పూన్ ఆవాలు మీ జీవక్రియ వేగాన్ని 25% వరకు పెంచుతాయి. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.

మీరు మీ రోజువారీ మెనూలో ఈ ఆహారాలను చేర్చుకుంటే వాటిని మితంగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఏదైనా ఎక్కువ తీసుకోవడం అంత మంచిది కాదు. అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ముఖ్య గమనిక: నెట్‌లో చదివిన సమాచారం మేరకు ఈ ఆర్టికల్ మీకు అందించబడింది. నిపుణులైన వైద్యుల అభిప్రాయానికి ఇది ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ స్వంత వైద్యుడిని సంప్రదించండి.

Tags

Read MoreRead Less
Next Story