ఈ ఇద్దరి కాంబినేషన్‌‌లో సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

ఈ ఇద్దరి కాంబినేషన్‌‌లో సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
ఏ ఇండస్ట్రీలోనైనా సరే.. హీరోల కొడుకులు హీరోలుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, రాణించడం అనేది కామన్.. దీనిని అభిమానులు కూడా ప్రోత్సహిస్తారు కూడా.

ఏ ఇండస్ట్రీలోనైనా సరే.. హీరోల కొడుకులు హీరోలుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, రాణించడం అనేది కామన్.. దీనిని అభిమానులు కూడా ప్రోత్సహిస్తారు కూడా.. కానీ హీరోల కుమార్తెలు హీరోయిన్‌‌గా రావడం అనేది వెరీ రేర్.. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ కుమార్తె మంజుల కూడా హీరోయిన్‌‌గా ఇండస్ట్రీలో రాణించాలని అనుకుంది.

ఈ మేరకు నటనలో మెలుకువలు కూడా నేర్చుకుంది. ముందుగా హీరోయిన్‌‌గా చేస్తానంటే హీరో కృష్ణ కూడా విముఖత చూపించారు.. కానీ ఆ తరవాత మంజుల ఇంట్రెస్ట్ చూసి ఒకే చెప్పారు. ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి చేతిలో పెట్టారు కృష్ణ.. అప్పటికి ఎస్వీ కృష్ణారెడ్డి.. బాలకృష్ణతో ఓ సినిమాకి కమిట్ అయ్యారు.. అదే టాప్ హీరో.. ఈ సినిమాకి హీరోయిన్‌‌గా మంజులని ఫైనల్ చేశారు.

ఇదే విషయం బయటకు రావడంతో కృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లి మంజుల హీరోయిన్‌గా నటిస్తే ఊరుకోమని పద్మాలయ స్టూడియో ముందు పెద్ద గొడవకి దిగారు. కృష్ణ ఎంత నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోలేదు..

చివరికి మంజుల హీరోయిన్‌‌గా నటించడం లేదని హీరో కృష్ణ చెప్పేవరకు వారి ఆందోళనలు ఆగలేదు. దీనితో బాలకృష్ణ, మంజుల కాంబినేషన్ మిస్ అయింది. ఆ తర్వాత మంజుల స్థానంలో సౌందర్యని తీసుకున్నారు. టాప్ హీరో అభిమానులను ఆకట్టుకోలేకపోయిన పెద్ద మ్యూజికల్ హిట్‌‌గా నిలిచింది. అయితే అభిమానులు అభ్యంతరం చెప్పడం పైన నటి మంజుల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

'వాళ్ల సోదరిని, ఇంటి ఆడపడుచుని అనుకుని నేను నటించేందుకు అడ్డు చెప్పారు తప్ప.. అంతకు మించి ఏం లేదు' అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆమె నటించి నటిగా ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story