Sugar Cane Juice: వర్షా కాలంలో ఓ గ్లాస్ చెరకు రసం.. అందానికీ, ఆరోగ్యానికి..

Sugar Cane Juice: వర్షా కాలంలో ఓ గ్లాస్ చెరకు రసం.. అందానికీ, ఆరోగ్యానికి..
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

Sugar Cane Juice: వర్షం పడుతున్నా ఓ గ్లాస్ చెరకు రసం జ్యూస్ తాగడం మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెరకు రసం ఆరోగ్యానికే కాదు అందానిక్కూడా మంచిది. మరింకెందుకు ఆలస్యం మీ మేని మెరుపులు సొగసులు సంతరించుకోవాలంటే రోజూ ఓ గ్లాస్ ఎత్తేసేయండి. బ్యూటీ ప్రోడక్ట్స్ పక్కన పెట్టేసేయండి. తాగిన తరువాత అడుగున ఓ స్పూన్ ఉంచి శుభ్రంగా ముఖానికి పట్టించేయండి దాంతో మీ ముఖానికి నాచురల్ క్లెన్సర్‌లా పని చేస్తుంది చెరకు రసం. మరికొన్ని ఉపయోగాలు తియ్యగా తెలుసుకుందాం..

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. వడ దెబ్బ తగలకుండా నివారిస్తుంది. తరచుగా చేసే జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.

శరీరంలోని ప్రోటీన్ లెవల్స్‌ను పెంచుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది. కిడ్నీల పనితనం మెరుగు పడుతుంది. లివర్‌ను పటిష్టం చేస్తుంది. పచ్చకామెర్ల వ్యాధి ఉన్న వారికి చెరుకు రసం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

తక్షణ శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఐరన్, పొటాషియం వంటివి ఇందులో అధికంగా ఉన్నాయి.

చెరుకు రసాన్ని తరచూ తీసుకుంటే మలబద్దకం తొలగిపోతుంది. కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు. డాక్టర్ చెప్పారనో లేదా బావుందనో ఒకటికంటే ఎక్కువ గ్లాసులు తాగకండి. ఏదైనా లిమిట్‌గా తీసుకుంటేనే అందం, ఆరోగ్యం.

Tags

Read MoreRead Less
Next Story