మహిళలు ఆ వయసులోపు పిల్లల్ని కనలేకపోతే..!

మహిళలు ఆ వయసులోపు పిల్లల్ని కనలేకపోతే..!
ఆధునిక సమాజం.. ఉరుకుల పరుగుల జీవితం.. వేతనాలు భారీగా ఉన్నా సుఖం, ప్రశాంతత లేని కాలం.. ఇంటా బయటా ఒత్తిళ్లతో మద్యం తాగి రిలాక్స్ అవడానికి అలవాటు పడిపోతున్నారు నేటి జంటలు

ఆధునిక సమాజం.. ఉరుకుల పరుగుల జీవితం.. వేతనాలు భారీగా ఉన్నా సుఖం, ప్రశాంతత లేని కాలం.. ఇంటా బయటా ఒత్తిళ్లతో మద్యం తాగి రిలాక్స్ అవడానికి అలవాటు పడిపోతున్నారు నేటి జంటలు. ఇక సంసారం సుఖం మాట అంతంతే..అందుకే ఇప్పుడు జంటలకు పిల్లలు పుట్టడం అనేది గగనంగా మారిపోయింది. దీనికోసం డాక్టర్లను సంప్రదిస్తూ లక్షలు ఖర్చు చేసుకుంటున్నాయి నేటి జంటలు. అయిన ఫలితం మాత్రం కనిపించడం లేదు.

గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో ఈ సంతన లేమి సమస్యలు శాతం ఘననీయంగా పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా.. కొత్త మంది జంటలు పెళ్ళైన వెంటనే పిల్లలని కనడానికి కాస్త విముకథ చూపిస్తున్నారు. ఇప్పుడే కదా పెళ్లైంది అప్పుడే పిల్లలు అవసరమా అంటూ తప్పించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. మహిళలు 37 ఏళ్ల కంటే ముందే గర్భం ధరించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 37 సంవత్సరాలు దాటితే మహిళల్లో ప్రెగ్నేన్సీ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు.

37 ఏళ్ల వయసులో కూడా అండాశయంలో అనేక అండాలు ఉన్నప్పటికీ వాటిలో క్వాలిటీ తగ్గుతుందని వారు వివరించారు. ఇక 37 ఏళ్లు దాటాకా ఒకవేళ గర్భం దాల్చినా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. 40 ఏళ్ల దాటినవాల్లైతే "ఐవీఎఫ్" పద్ధతిలో గర్భం దాల్చడం ఉత్తమమని చెబుతున్నారు. అయితే మీకు పిల్లలు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మద్యానికి దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లేదంటే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదని.. ఒకవేళ పుట్టినా మానసికంగా, శారీరకంగా బలహీనులు ఉండి ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయని పరిశోధనలో తేలింది.

ఈ విషయంలో చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దాదాపు 30 ఏళ్ల డేటా ఆధారంగా 3.40 లక్షల మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. పురుషులు.. తమ భార్య గర్భం ధరించడానికి 6 నెలల ముందు నుండే అల్కహాల్ తీసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు. అల్కహాల్ తీసుకోవడం కొనసాగిస్తే పుట్టబోయే పిల్లలు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంతో ఉండరని..పుట్టుకతో వచ్చే గుండే జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

మహిళలు కూడా గర్భాధారణకు ఏడాది ముందే అల్కహాల్ తీసుకోవడం మానేస్తేనే పిల్లలు ఆరోగ్యంతో పుడుతారని స్పష్టం చేశారు నిపుణులు. భార్య, భర్తలకి మద్యం అలవాటు ఉండి గర్భం ధరించిన వారిలో 42శాతం పిల్లలు ఆరోగ్య సమస్యలతో పుట్టారని వారు వివరించారు. దీంతో పిల్లలు కావాలనుకునే దంపతులు ఖచ్చితంగా ఆ ఏడాది పాటు మద్యానికి దూరంగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

Tags

Read MoreRead Less
Next Story