watermelon: వేసవి కాలంలో పుచ్చకాయ.. గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్ నిరోధానికి..

watermelon: వేసవి కాలంలో పుచ్చకాయ.. గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్ నిరోధానికి..
watermelon: వేసవి కాలంలో విరివిగా దొరికే పుచ్చకాయ ఎండ వేడిమి నుంచి రక్షిస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూస్తుంది.

watermelon: వేసవి కాలంలో విరివిగా దొరికే పుచ్చకాయ ఎండ వేడిమి నుంచి రక్షిస్తుంది. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూస్తుంది. వీలైతే సమ్మర్ అంతా ప్రతి రోజూ పుచ్చకాయ తినడానికి ప్రయత్నించాలి. పుచ్చకాయ తియ్యగా ఉండి శరీరానికి శక్తిని ఇస్తుంది. రిఫ్రెష్ ని కలిగిస్తుంది.

దీని రుచి కారణంగా ప్రతి ఒక్కరు పుచ్చకాయను తినడానికి ఇష్టపడతారు. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా లైకోపీన్, ఆస్కార్బిక్ యాసిడ్, సిట్రూలిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె జబ్బుల నుండి క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తాయి.

వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉండి దాహం అవుతుంది కానీ ఆకలి అవదు. అన్నం తినాలనిపించదు. చాలామంది డీహైడ్రేషన్ సమస్యలను ఎదుర్కొంటారు. ఇటువండి వారికి పుచ్చకాయ సరైన చిరుతిండి. ఇది 90-92% నీటిని కలిగి ఉంటుంది. పోషకాలు అధికంగా ఉంటాయి. పుచ్చకాయ ముక్కలు తిన్నా, కొంచెం చల్లగా జ్యూస్ రూపంలో తీసుకున్నా శరీరానికి, మనసుకు హాయిగా అనిపిస్తుంది.


ఈ పండు యొక్క గొప్పదనం ఏమిటంటే.. ఇందులో చాలా తక్కువ కేలరీలు, తక్కువ సోడియం ఉండటం వలన దాదాపు ఇది అందరికీ సురక్షితమైన పండు. పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, బి6, పొటాషియం, యాంటీ-ఆక్సిడెంట్లు లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి వివిధ పోషకాలు ఉన్నాయి.

గుండె ఆరోగ్యానికి అద్భుతమైనది

యాంటీఆక్సిడెంట్లు సెల్ డ్యామేజ్‌ను నిరోధించడంలోనూ, క్యాన్సర్‌ కారకాలను నిరోధించడంలో కూడా సహాయపడతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.

ఆరోగ్యకరమైన చర్మం, కళ్ళు

పుచ్చకాయలో ఉన్న నీటి కంటెంట్, విటమిన్ B6, విటమిన్ సి కారణంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అందువల్ల చర్మం మృదువుగా ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే పుచ్చకాయలోని లైకోపీన్ కంటెంట్ సూర్యరశ్మి నుండి రక్షిస్తుంది. కాబట్టి వడదెబ్బకు గురయ్యే అవకాశం తక్కువ. పుచ్చకాయలోని విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

వ్యాయామ సమయంలో..

పుచ్చకాయలోని పొటాషియం కంటెంట్ వ్యాయామా సమయంలో వచ్చే కండరాల నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది. వ్యాయామానికి ముందు లేదా తర్వాత పుచ్చకాయ ముక్కలు తీసుకుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

గర్భధారణ సమయంలో వచ్చే మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది

గర్భిణీ స్త్రీలకు పుచ్చకాయ ఉత్తమమైన ఆహారం. ఇది గుండెల్లో మంటను తగ్గిస్తుంది. ఇందులోని మినరల్స్ కాలి కండరాల తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. పొటాషియం కంటెంట్ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. తేలికగా జీర్ణమయ్యే ఫైబర్ గర్భధారణ సమయంలో మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story