వర్క్ ఫ్రం హోమ్.. ఆ ఇళ్లకే అధిక డిమాండ్..

వర్క్ ఫ్రం హోమ్.. ఆ ఇళ్లకే అధిక డిమాండ్..
Work from home: ఇంటి నుంచి పని చేయాలి.. ఎవరూ డిస్ట్ర్రబ్ చేయకూడదంటే మీకో రూమ్ సెపరేట్‌గా ఉండాలి.

ఇంటి నుంచి పని చేయాలి.. ఎవరూ డిస్ట్ర్రబ్ చేయకూడదంటే మీకో రూమ్ సెపరేట్‌గా ఉండాలి. కష్టపడి పని చేస్తున్నది దేనికీ.. కాస్త సుఖంగా ఉండడానికే కదా. అందుకే ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు.. మూడు పడక గదుల ఇళ్లకు మొగ్గు చూపుతున్నారు నగర వాసులు. శివారు ప్రాంతాలైనా సౌకర్యాలన్నీ ఉండడంతో అక్కడ కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

గ్రేటర్ పరిధిలోని ప్రధాన కూడళ్లైన గచ్చిబౌలి పైనాన్షియల్ జిల్లా, హైటెక్‌సిటీ, మాదాపూర్, కిస్మత్‌పూర్, శంషాబాద్, నిజాంపేట, మియాపూర్, బాచుపల్లి, కొంపల్లి, రాయదుర్గం, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లలో త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌ను బుక్ చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు నాటికి త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్‌ను బుక్ చేసుకునే వారి శాతం 44 నుంచి 56 శాతానికి పెరగడం విశేషం. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య కాస్త తగ్గింది.

కోవిడ్ ఎఫెక్ట్‌తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం ఏడాది చివరి నాటికి పరిస్థితి మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

కోవిడ్‌కు ముందు అపార్ట్‌మెంట్ నిర్మాణానికి సంబంధించి నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు బిల్డర్లు రూ.1400 నుంచి రూ.1600 వరకు వ్యయం చేసేవారు.

ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి సంబంధించిన ముడి సరుకు ధరలు అనూహ్యంగా పెరగడంతో చదరపు అడుగుకు రూ.1800 నుంచి రూ.2000 వరకు పెరిగింది.

కాగా నగర శివార్లలో అపార్ట్‌మెంట్స్ నిర్మాణాలు ఏ మాత్రం తగ్గలేదని అధ్యయనం పేర్కొంది. నూతన నిర్మాణాలు కూడా విరివిగా చేపడుతున్నారు.

కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు.. నిర్మాణానికంటే ముందే ఫ్రీ లాంచ్ బుకింగ్ చేసుకున్న వారికి ఆఫర్ల పేరుతో భారీ తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నారు.

నిర్మాణం ప్రారంభం కాక ముందే చదరపు అడుగుకు రూ.3000 నుంచి రూ.3500 ధరలు ఆఫర్ చేస్తున్నారు. ఫ్లాట్ పూర్తయ్యేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుందని ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు.

బిల్డర్లు చెప్పిన లెక్క ప్రకారం వెయ్యి చదరపు అడుగులున్న ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.30 నుంచి రూ.35 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తరువాత ఈ ధరలు రెట్టింపు అవుతాయని చెబుతున్నారు. వసతులు, సౌకర్యాలు, రవాణా సౌకర్యం మెరుగుపడడంతో ధరలు ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే కొందరు వినియోగదారులు ముందస్తు బుకింగులకు మొగ్గు చూపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story