World Kidney Day 2022: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 8 ఆరోగ్యకరమైన అలవాట్లు

World Kidney Day 2022: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 8 ఆరోగ్యకరమైన అలవాట్లు
World Kidney Day 2022: జీవనశైలిలో ఈ 8 ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవడం ద్వారా మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.

World Kidney Day 2022: కిడ్నీలు వెన్నెముకకు రెండు వైపులా ఒక పిడికిలి పరిమాణంలో చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న అవయవం. ఇవి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. మరీ ముఖ్యంగా, అవి రక్తం నుండి వ్యర్థ పదార్థాలు, అదనపు నీరు, ఇతర మలినాలను ఫిల్టర్ చేస్తాయి. ఈ వ్యర్థ పదార్ధాలు మూత్రాశయంలో నిల్వ చేయబడతాయి. అనంతరం మూత్రం ద్వారా బయటకు పంపబడతాయి.

అదనంగా మూత్రపిండాలు శరీరం యొక్క PH, ఉప్పు, పొటాషియం స్థాయిలను నియంత్రిస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రించే 'రెనిన్' హార్మోన్లను, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి 'ఎరిథ్రోపోయిటిన్'ను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఎముకలను నిర్మించడానికి, కండరాల పనితీరును మెరుగుపరచడానిక,. శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడే విటమిన్ డి రూపాన్ని సక్రియం చేయడానికి మూత్రపిండాలు కూడా బాధ్యత వహిస్తాయి.

1.రెగ్యులర్ వ్యాయామం: క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వ్యాయామం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. వ్యాయామం అంటే నడక, సైక్లింగ్, డ్యాన్స్ కూడా ఆరోగ్యానికి అద్భుతమైనవి.


2.రక్తంలో చక్కెరను నియంత్రించాలి: మధుమేహం ఉన్న వ్యక్తుల కిడ్నీలు దెబ్బతినవచ్చు. ఇది శరీరంలోని కణాలు రక్తంలోని గ్లూకోజ్ (చక్కెర)ను నియంత్రించలేకపోతే మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి అదనంగా కష్టపడవలసి వస్తుంది. అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకమవుతుంది.


3.అధిక రక్తపోటు: అధిక రక్తపోటు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు. మధుమేహం, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు అధిక రక్తపోటు సంభవించినట్లయితే, శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన రక్తపోటు 120/80 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే వైద్యుడిని సంప్రదించడం కీలకం.


4.బరువును నియంత్రించాలి: అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తుల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వీటిలో మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కాలీఫ్లవర్, బ్లూబెర్రీస్, చేపలు, తృణధాన్యాలు వంటి సోడియం తక్కువగా ఉండే తాజా పదార్థాలను తినడంపై దృష్టి పెట్టాలి.


5.ద్రవపదార్థాలు పుష్కలంగా త్రాగండి: రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి. ఎందుకంటే నీరు శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయం చేస్తుంది. తగినంత నీటిని తీసుకోవడం మీ కిడ్నీలకు ఆరోగ్యకరం. ఒక రోజులో కనీసం 1.5 నుండి 2 లీటర్ల వరకు నీరు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. మీ శరీరానికి ఎంత నీరు అవసరం అనేది ప్రధానంగా మీ ఆరోగ్యం మరియు జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. అలాగే, ఇంతకుముందు కిడ్నీలో రాళ్లు ఉన్నవారు భవిష్యత్తులో దానిని నివారించడానికి కొంచెం ఎక్కువ నీరు త్రాగాలి.


6.ధూమపానంకి దూరంగా : ధూమపానం మీ శరీరం యొక్క రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది మీ శరీరం మరియు మీ మూత్రపిండాలు అంతటా రక్త ప్రవాహా వేగాన్ని నెమ్మదిస్తుంది. ధూమపానం వల్ల కిడ్నీల సమస్యతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.


7.తీసుకునే ఔషధాలు: మీరు క్రమం తప్పకుండా పెయిన్ కిల్లర్స్ మందులను తీసుకుంటే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAID) ని తలనొప్పి లేదా ఆర్థరైటిస్ కోసం క్రమం తప్పకుండా తీసుకుంటే అవి మీ మూత్రపిండాలను దెబ్బతీస్తాయి.


8. గుర్తుంచుకోవలసిన అంశాలు..

మీరు తక్కువ బరువుతో జన్మించినట్లయితే

మీరు కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD) ఉంటే లేదా దానితో సన్నిహిత కుటుంబ సభ్యుడు ఉంటే

మీకు లేదా సన్నిహిత కుటుంబ సభ్యులకు అధిక రక్తపోటు చరిత్ర ఉంటే

మీకు ఊబకాయం ఉంటే

సాధారణ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (KFT) అనేది మీ కిడ్నీ ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. ఏదైనా నష్టం జరగకుండా ముందుగానే నిరోధించవచ్చు

Tags

Read MoreRead Less
Next Story