హెల్త్ & లైఫ్ స్టైల్

World No Tobacco Day: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.. ద్రాక్ష రసంతో నికోటిన్ ప్రభావానికి చెక్..

World No Tobacco Day:

World No Tobacco Day: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.. ద్రాక్ష రసంతో నికోటిన్ ప్రభావానికి చెక్..
X

World No Tobacco Day: నేడు ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం. ఈ సందర్భంగా పొగాకు వల్ల కలిగే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు వైద్యులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మే 31, 1987న ఈ రోజును పొగాకు వ్యతిరేక దినంగా ప్రారంభించింది.

WHO ప్రకారం, సిగరెట్ పొగ కారణంగా, ప్రతి సంవత్సరం 80 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ పర్యావరణంలోకి ప్రవేశిస్తోందని, దీని కారణంగా వాతావరణం విషపూరితంగా మారుతుందని తెలియజేస్తోంది. ధూమపానం మనుషుల ఊపిరితిత్తులనే కాదు పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తుంది.

అల్లం టీ తీసుకోవడం - మీరు ధూమపానం మానేయాలనుకుంటే అల్లం టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి, మీరు అకస్మాత్తుగా పొగాకు-సిగరెట్లను విడిచిపెట్టినప్పుడు వికారం లేదా తల తిరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. వీటినుంచి ఉపశమనం పొందాలంటే అల్లం టీ లేదా అల్లం జ్యూస్ తయారు చేసి తాగవచ్చు.

ద్రాక్ష రసం తాగడం - మీరు సిగరెట్ తాగినప్పుడు, విషపూరితమైన నికోటిన్ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది నెమ్మదిగా ఊపిరితిత్తులు మరియు గొంతును పాడు చేస్తుంది. నిజానికి, శరీరం నుండి ఈ నికోటిన్ తొలగించడానికి, మీరు ద్రాక్షపండు రసం త్రాగాలి. ఈ జ్యూస్‌లో ఉండే అసిడిక్ కంటెంట్ శరీరం నుండి నికోటిన్‌ను తొలగించడానికి సహాయపడుతుంది.

పొద్దుతిరుగుడు విత్తనాల వినియోగం- సిగరెట్ లేదా గుట్కా తాగే అలవాటు మానుకోవడానికి చాలా సమయం పడుతుంది. వదిలేద్దామని అనుకున్నా.. పదే పదే స్మోక్ చేయాలన్న ఆలోచన వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ప్రతి రోజు కొన్ని పొద్దుతిరుగుడు విత్తనాలను నెమ్మదిగా నమలడం ద్వారా ఈ అలవాటును మానుకోవచ్చు.

ధూమపానం క్యాన్సర్‌కు కారణమవుతుంది, చర్మం త్వరగా ముడతలు పడుతుంది. వృద్ధాప్యలు వస్తాయి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

ధూమపానం మధుమేహాన్ని నియంత్రించడం మరియు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడం కూడా కష్టతరం చేస్తుంది. ఎందుకంటే అధిక స్థాయి నికోటిన్ ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ధూమపానం చేసేవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది.

హైపర్‌టెన్షన్ లేదా బిపి విషయంలో, సిగరెట్‌లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులలోని నికోటిన్ రక్త నాళాలను ఇరుకుగా, గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తాయి. ఇది మీ రక్తపోటును పెంచుతుంది. మీరు ధూమపానం, పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం మానేసినట్లయితే, రక్తపోటును, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

మీరు తినే ఆహారం, జీవనశైలి కూడా మీ ధూమపాన అలవాట్లు, ఆరోగ్య విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. యోగా, మెడిటేషన్, మార్నింగ్ వాక్ వంటివి అలవాటు చేసుకోవాలి. సిగరెట్ మానేస్తానని మనసులో ప్రతిజ్ఞ చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభంలో ఇవన్నీ మీకు పనికిరానివిగా కనిపిస్తాయి. కానీ మీరు ఈ విషయాలకు అలవాటు పడ్డాక, మీ శరీరం, మనసు తేలికగా ఉంటుంది. మీ ఆలోచనలలో స్పష్టత ఉంటుంది. ఇన్ని రోజులు ధూమపానం ఎందుకు చేశాము, ఎందుకు మానలేకపోయాం అని దాని గురించి బాధపడటం ప్రారంభమవుతుంది.

ముఖ్యంగా మీరు జన్మనిచ్చిన మీ పిల్లలు మిమ్మల్నే ఫాలో అవుతుంటారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.. అటు మీకు, ఇటు మీ పిల్లలకు చెడు చేసేదాన్ని ఎందుకు అలవాటు చేసుకోవాలి.. ఏదైనా గట్టిగా అనుకుంటే చేయగలరు.. ఆ పని ఎప్పటి నుంచో కాదు ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి.. మీ పిల్లలకు మీరే మార్గదర్శకులు అవ్వాలి. ఆరోగ్యాన్ని హరించే ఏదీ కూడా ఆనందాన్ని ఇస్తుంది అని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే అని గుర్తుంచుకోవాలి.Next Story

RELATED STORIES