Uttar Pradesh: రేప్‌కు గురైన బాలిక.. సాయం కోసం వచ్చిన తల్లిపై పోలీస్ అత్యాచారం..

Uttar Pradesh: రేప్‌కు గురైన బాలిక.. సాయం కోసం వచ్చిన తల్లిపై పోలీస్ అత్యాచారం..
Uttar Pradesh: కొన్నిరోజుల క్రితం 17 ఏళ్ల తన కూతురు అత్యాచారానికి గురైందని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Uttar Pradesh: రేపిస్ట్‌లను శిక్షించడానికి కఠినమైన చట్టాలు ఉన్నాయి. వారిని దండించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ ఇవేవి రోజురోజుకీ ఆడవారిపై పెరుగుతున్న అత్యాచారాలను, అఘాయిత్యాలను ఆపలేకపోతున్నాయి. ముఖ్యంగా సాయం చేయాల్సిన పోలీసులే విచక్షణ లేకుండా నిందితులుగా మారడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి ఓ ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

కొన్నిరోజుల క్రితం 17 ఏళ్ల తన కూతురు అత్యాచారానికి గురైందని ఓ తల్లి ఉత్తరప్రదేశ్‌లోని కాన్నౌజ్ ప్రాంతంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసును అనూప్ కుమార్ మౌర్యకు అప్పగించారు. ఇటీవల కేసు విషయం మాట్లాడాలని మహిళను ఇంటికి ఆహ్వానించాడు మౌర్య. అక్కడే మౌర్య తనను అత్యాచారం చేశాడంటూ ఎస్పీకి ఆ మహిళ ఫిర్యాదు చేసింది.

మహిళ చెప్పినవన్నీ నిజాలని తేలడంతో పోలీసులు మౌర్యను సస్పెండ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే అతడికి కోర్టులో ప్రవేశపెడతామని ఎస్పీ తెలిపారు. ఈ ఘటన చూసినవారంతా పోలీసులే ఇలా ఉంటే.. ఇక మహిళలు సాయం కోసం ఎవరివైపు చూడాలి అని వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story