వినడానికే వింత.. దెయ్యాలు నిర్మించిన దేవాలయం.. ఒక్క రాత్రిలో శివుని మందిరం

కొన్ని వినడానికే వింతగా ఉంటాయి.. అసలు దెయ్యాలు ఉన్నాయంటేనే నమ్మం.. కానీ దేవుడు ఉన్నాడని నమ్మితే దెయ్యం ఉన్న విషయం కూడా నమ్మాలి కదా అంటారు. ఈ వాదనని పక్కన పెడితే గుజరాత్‌లో శివుని ఆలయం ఒకటి దర్శనమిచ్చింది. అందులో ఏముంది వింత అంటే అదే కదా వార్త.. ఆ ఆలయాన్ని నిర్మించింది దెయ్యాలు అని, అదీ ఒక్క రాత్రిలో నిర్మించాయని స్థానికులు చెబుతున్నారు.
కేవలం ఒక రాత్రిలో దెయ్యం ఒక భారీ ఆలయాన్ని నిర్మించిందని వినడానికి మనకి కొంచెం వింతగా అనిపిస్తుంది. ఒక రాత్రిలో దెయ్యాలు నిర్మించిన ఈ ఆలయం పరమ శివునిది. వాస్తవానికి శివుడిని అందరూ ఆరాధిస్తారు.. అది దేవుడు లేదా దెయ్యం అయినా. ప్రజలందరూ ఆయనను సమానంగా ఆరాధిస్తుంటారు.
ఈ ఆలయాన్ని శివుడిని ఆరాధించడానికి దెయ్యాలు నిర్మించాయని చెబుతారు. కానీ ఆలయానికి సంబంధించిన పని అసంపూర్తిగా ఉంది. ఇంకా చాలా పని మిగిలి ఉంది. మరి ఎందుకు అలా మిగిలిపోయిందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే గుజరాత్ లోని కాతియవార్‌లో దర్శనమిస్తుంది. అద్భుతమైన ఈ ఆలయం రాతి కట్టడంతో నిర్మితమై ఉంది. ఈ ప్రదేశం, ఈ ఆలయ సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ఈ ఆలయం సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం బాబ్రా అనే దెయ్యం చేత చేయబడినది. ఆలయం గోపురం సోమనాథ్ జ్యోతిర్లింగం లాగా చాలా ఎత్తైనది. ఈ ఆలయం నిర్మాణంలో శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతుంది. ఖజరహో, సోమనాథ్ ఆలయ కట్టడాలను గుర్తుకుతెస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com