అత్యంత ప్రమాదకర జీవులు.. తాకితే అంతే సంగతులు..

Poisonous creatures: అందమైన ప్రకృతిలో అందరికీ చోటు ఉంటుంది.. మనుగడ కోసం, తమ ఉనికిని కాపాడు కోవడం కోసం కొన్ని జీవరాసులు విషం చిమ్ముతుంటాయి. అవి మనుషులకు కూడా హాని కలిగిస్తుంటాయి. ఇలాంటి జీవులు ప్రపంచంలో చాలా ఉన్నా అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత జీవులు కొన్ని ఉన్నాయి. వీటిని తాకితే ప్రాణాలు పోతాయి. వాటి గురించి తెలుసుకుందాం.
తేలు..
ఇది మామూలు తేలు కాదండోయ్.. సాధారణంగా కనిపించే తేలు కుడితే డాక్టర్ దగ్గరకు వెళ్లి మెడిసిన్ తీసుకుంటే దాని విష ప్రభావం తగ్గిపోతుంది. కానీ ఈ రెడ్ స్కార్పియన్ అనే పేరుగల తేలు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైంది. ఇది మొదట భారతదేశంలో కనిపించింది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ సహా దక్షిణాసియా దేశాల్లో కనిపించే ఈ తేలు మనిషిని కాటేస్తే మరణం ఖాయం. ఈ తేలు కుట్టిన 72 గంటల్లో వైద్యుడిని సంప్రదించకపోతే అంతే సంగతులు.. ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవలసిందే.
సాలీడు..
ఆస్ట్రేలియాలో కనుగొన్న ఈ ఫన్నెల్ వెబ్ స్పైడర్ విషం సైనైడ్ కంటే ప్రమాదకరం. ఇది ఎవరినైనా కుడితే 15 నిమిషాల నుంచి 3 రోజుల వ్యవధిలో మరణిస్తారని చెబుతారు.
మార్బుల్ కోన్ స్నె్ల్దీ..
దీని విషయం దాని పరిసరాల్లోకి వచ్చిన ఇతర జీవులను అంధులను చేస్తుంది. తర్వాత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అనంతరం పక్షవాతం వచ్చి మరణానికి దారితీస్తుంది.
బాక్స్ జెల్లీ ఫిష్..
సముద్రం అడుగున నివసించే జెల్లీ ఫిష్ లు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. కానీ ఒక్కసారి విషం చిమ్మితే 60 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
ఆక్టోపస్..
బ్లూలైన్ ఆక్టోపస్.. టేబుల్ టెన్నిస్ బాల్ అంత చిన్నగా ఉంటుంది. అయితేనేం పిట్ట కొంచెం కూత ఘనం అన్నమాదిరిగా.. దాని విషం మొదట కళ్లను, శ్వాస కోశ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుంది.
కింగ్ కోబ్రా..
పాము పేరు చెబితేనే వణికిపోతాము.. విషసర్పం అన్న విషయం అందరికీ తెలిసినా. ఒక్క స్ట్రింగ్ లో 5 రెట్లు కంటే ఎక్కువ విషాన్ని విడుదల చేస్తుంది.
కలర్ కలర్ కప్పలు అందంగా కనిపిస్తున్నాయనుకుంటాం కానీ ఆ అందం వెనుక విషం దాగి ఉన్న విషయం ఎందరికి తెలుసు.. డార్ట్ ప్రాగ్ధక్షిణ అమెరికాలో కనిపించే ఈ కప్ప అత్యంత ప్రాణాంతకం.
ఇన్లాండ్ తైపాన్ ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్ ల్యాండ్ తైపాన్ విషపూరితమైన పాము జాతికి చెందినది. దీని విషంలో న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఇది 45 నిమిషాల్లో మనిషిని చంపేస్తుంది.
స్టోన్ ఫిష్.. సముద్రంలో కనిపించే విషపూరితమైన చేప ఇది. దీని విషంతో ఇతర జీవులు పక్షవాతానికి గురవుతాయి.
పఫర్ ఫిష్
ఇది చాలా అందంగా ఉన్న విషపూరితమైన చేప.. జపాన్, చైనా, ఫిలిఫ్పీన్స్, మెక్పికోలలో కనిపిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com