మోదీ వల్లే పుల్వామా ఎటాక్‌ జరిగింది: దిగ్విజయ్‌ సింగ్‌

మోదీ వల్లే పుల్వామా ఎటాక్‌ జరిగింది: దిగ్విజయ్‌ సింగ్‌
Digvijay Singh: బీజేపీ అబద్ధాల కోరు...

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సోమవారం బీజేపీపై నిప్పులుచెరిగారు. పాకిస్థాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ తామే చేశామని చెప్పుకుంటున్నారు. దానికి ఏ మాత్రం రుజువు లేదన్నారు. సర్జికల్‌ స్ట్రైయిక్‌లో టెర్రరిస్టులను చాలా మందిని చంపామని చెప్పుకుంటుంది దానికి కూడా ఏ ప్రూఫ్ లేదని ఆయన జమ్మూలో రాహుల్‌ జోడో యాత్రలో భాగంగా వెల్లడించారు. బీజేపీ కేవలం అబద్దాలు చెప్పి పాలిస్తుందని దుయ్యబెట్టారు.


2019 టెర్రర్‌ ఎటాక్‌లో దేశం 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లలను కోల్పోయామని పుల్వామా చాలా సున్నితమైన ప్రదేశమని అక్కడ నుంచి జవాన్లలను ఆకాశ మార్గంలో తీసుకెళ్లాలని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్‌ చెప్పినా అందుకు మోదీ ఎందుకు అనుమతించలేదని దిగ్విజయ్‌ ప్రశ్నించారు. పుల్వామా టెర్రరిజానికి కేంద్రమని ప్రతి వాహనాన్ని అక్కడ తప్పకుండా తనిఖీ చేస్తారని కానీ ఆ ఒక్క రోజు మాత్రం టెర్రరిస్టులు రాంగ్‌ రూట్‌లో వచ్చిన స్కార్పియో కారును ఎందుకు తనిఖీ చేయలేదని నిలదీశారు. అందుకే 40 మంది జవాన్లను కోల్పోయామన్నారు. ఇప్పటి వరకు ఆ సంఘటనకు సంబంధించి సమాచారాన్ని పార్లమెంటులోగానీ ప్రజలకు గాని తెలపలేదని వెల్లడించారు.

Tags

Next Story