ఒడిశా మంత్రిపై కాల్పులు

ఒడిశా మంత్రిపై కాల్పులు
ఆరోగ్య శాఖ మంత్రిపై అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కాల్పులు జరిపాడని బ్రజరాజ్ నగర్ SDPO గుప్తేశ్వర్ భోయ్ మీడియాకు తెలిపారు

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిపై ఓ పోలీసు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మంత్రి ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. హుటాహుటిన మంత్రిని హాస్పిటల్ కు తరలించారు. దాస్ పై కాల్పులు జరిపిన వ్యక్తి ఏఎస్ఐ గోపాల్ దాస్ గా గుర్తించారు. ఆదివారం బ్రజరాజ్ నగర్ లోని గాంధీ చౌక్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నబా దాస్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రిపై అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కాల్పులు జరిపాడని బ్రజరాజ్ నగర్ SDPO గుప్తేశ్వర్ భోయ్ మీడియాకు తెలిపారు.

నిందితుడు గోపాల్ దాస్ తన సర్వీస్ రివాల్వర్ తో మంత్రిపై కాల్పులు జరిపాడని తెలిపారు గుప్తేశ్వర్ భోయ్. కాల్పులకు గల కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. మంత్రి పర్యటిస్తున్న గాంధీనగర్ లో గోపాల్ దాస్ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాల్పుల ఘటనతో బీజేడీ కార్యక్తలు ధర్నా నిర్వహించారు. పోలీసులే ప్రజాప్రతినిధులపై కాల్పులు జరపడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

Next Story