రాహుల్‌ గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై ఈడీ ఫోకస్‌

రాహుల్‌ గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై ఈడీ ఫోకస్‌
కాంగ్రెస్‌ పార్టీ తరపున సవాయి నుంచి 23.54 లక్షలు తనకు అందినట్లు దర్యాప్తులో టీఎంసీ నేత సాకేత్‌ గోఖలే చెప్పారు

రాహుల్‌ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి అలంకార్‌ సవాయ్‌పై ఈడీ దృష్టి సారించింది. టీఎంసీ నేత, ఆర్టీఐ కార్యకర్త సాకేత్‌ గోఖలే ఆర్థిక వ్యవహారల్లో వచ్చిన మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలపై అలంకార్‌ సవాయిని ప్రశ్నించారు అధికారులు. బుధ, గురు, శుక్రవారాల్లో ఆయన్న ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా వ్యవహారాల నిర్వహణ కోసం కాంగ్రెస్‌ పార్టీ తరపున సవాయి నుంచి 23.54 లక్షలు తనకు అందినట్లు దర్యాప్తులో టీఎంసీ నేత సాకేత్‌ గోఖలే చెప్పారు. అయితే ఈ ఆరోపణల్ని ఖండించారు అలంకార్‌ సవాయి. గోఖలే తనకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని ఈడీ అధికారులకు స్పష్టం చేశారు. గతంలోనూ సోనియా వ్యక్తిగత కార్యదర్శి మాధవన్‌ పైనా వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు రాహుల్ వ్యక్తిగత కార్యదర్శిపైనా ఆరోపణలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story