త్రిపురను హింస నుంచి అభివృద్ధి వైపు నడిపించాం : పీఎం మోదీ

త్రిపురను హింస నుంచి అభివృద్ధి వైపు నడిపించాం : పీఎం మోదీ
కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు త్రిపురను దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉంచాయన్నారు


త్రిపురను భయం, హింస నుంచి బీజేపీ విముక్తి చేసిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధలై జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు త్రిపురను దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉంచాయన్నారు. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని తీసుకొచ్చిందని అన్నారు. హింస అనేది త్రిపురకు గుర్తింపుకాదని తెలిపారు. గతంలో త్రిపుర పోలీస్టేషన్లను సీపీఎం క్యాడర్ స్వాధీనంలో ఉండేవని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన ఉందని ఆయన తెలిపారు.

త్రిపురలో మహిళా సాధికారత బీజేపీ ప్రభుత్వం వలన లభించిందని అన్నారు పీఎం మోదీ. త్రిపురలో 55 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన ఐదు స్థానాలను కూటమిలోని.. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర కు వదిలి పెట్టారు. లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి కలిసి మొత్తం 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story