"మోహన్ భగవత్ కు భారత్ ఎలాగో మాకూ అంతే"

ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భారత దేశం ఎలాగైతే సొంతమో మహమూద్ కు కూడా భారత్ సొంతమని అన్నారు 'జమియత్ ఉలమా-ఇ-హింద్' అధ్యక్షుడు మహమూద్ మదాని. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 'జమియత్ ఉలమా-ఇ-హింద్' ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన ఆయన, భారత దేశం.. ముస్లింలకు మాతృదేశమని, బయట నుంచి ముస్లిం మతం భారత్ లోకి రాలేదని చెప్పారు. మోదీ, మోహన్ భగవత్ కంటే ఎక్కువగా ముస్లింలకే ఈ దేశంపై హక్కు ఉందని అన్నారు.ఇస్లాం అన్ని మతాలలా పురాతనమైన మతం అని, హిందీ ముస్లింలకు భారతదేశం కంటే ఉత్తమమైన దేశం లేదని మదానీ తెలిపారు.
బలవంతపు మతమార్పిడిలను తాము వ్యతిరేకమని, అయితే స్వచ్భందంగా మతం మారుతున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మదాని అన్నారు. మతస్వేచ్చ ప్రాథమిక హక్కని, బలవంతంగా, మోసం, దురాశతో మత మార్పిడి చేయకూడదని ఆయన తెలిపారు. చాలా సంస్థలు ముస్లింలను లక్షంగా చేసుకున్నాయని అన్నారు. జమియత్ ఉలమా-ఇ-హింద్ ప్లీనరీ శుక్రవారం ప్రారంభమైంది. యునిఫాం సివిల్ కోడ్, మత స్వేచ్చ, ముస్లిం వ్యక్తిగత చట్టం, మదర్సాల స్వయం ప్రతిపత్తి వంటి అంశాలు ప్లీనరీలో చర్చించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com