విద్యుత్తు ఉత్పాదనకు విదేశీ బొగ్గు వాడాల్సిందే

విద్యుత్తు ఉత్పాదనకు విదేశీ బొగ్గు వాడాల్సిందే
దేశంలో బొగ్గుకొరతను తీర్చేందుకే థర్మల్ ప్లాంట్లలో ఉపయోగించే బొగ్గులో 10 శాతం విదేశీబొగ్గును వాడితీరాలనే నిబందన

దేశంలో విద్యుత్తు ఉత్పాదనకు విదేశీ బొగ్గును తప్పనిసరిగా వాడాల్సిందేనని కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే విదేశీ బొగ్గుతో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను యూనిట్‌కు 50రూపాయలకు ఓపెన్‌ మార్కెట్‌లో అమ్ముకోవడానికి వీలు కల్పించిన సీఈఆర్‌సీ ఇప్పుడు విదేశీ బొగ్గు వినియోగంపై ఆదేశాలు జారీ చేసింది. విద్యుదుత్పత్తి డిమాండ్‌కు అనుగుణంగా దేశీయ బొగ్గు నిల్వలు లేవని సీఈఆర్‌సీ అంటోంది.

దేశీయంగా బొగ్గు సరఫరాను తగ్గించేస్తామని ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి ప్రతి ఉత్పత్తి కేంద్రం 15 శాతం విదేశీబొగ్గును కొనాల్సిందే అని గట్టిగా చెప్పింది.దేశీయ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు దేశీయంగా దొరికే బొగ్గు సరఫరాను తగ్గించేస్తామని కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. గతంలోనే దేశంలో బొగ్గుకొరతను తీర్చేందుకే థర్మల్ ప్లాంట్లలో ఉపయోగించే బొగ్గులో 10 శాతం విదేశీబొగ్గును వాడితీరాలనే నిబందనను కేంద్రం తీసుకొచ్చింది. విదేశీబొగ్గు నిల్వలను క్రమంగా పెంచుకుంటు పోవాలని కేంద్రం డిసైడ్ చేసింది. ఈ నేపధ్యంలో విదేశీబొగ్గు కొనుగోలు విషయంలో రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ఉన్న 170 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఎంతున్నాయనే విషయమై కేంద్రం ఆరాతీస్తోంది.

మరోవైపు భారత్‌కు ఆస్ట్రేలియా,ఇండోనేషియా,ఉక్రెయిన్, రష్యా నుండి బొగ్గు దిగుమతవుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతోగా బొగ్గు సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో మిగిలిన రెండు దేశాలు కూడా బొగ్గు సరఫరాను నిలిపేశాయి. దీంతో బొగ్గు నిల్వలు అయిపోయి కొరత వచ్చేసి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పడిపోయిందని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఇప్పటికే విదేశీ బొగ్గును ఆరునూరైనా కొనాల్సిందేనంటూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ గత ఏడాది కాలంగా జెన్‌కోలపై ఒత్తిడి తెస్తోంది. 2023 సెప్టెంబరు వరకు మొత్తం బొగ్గు వినియోగంలో 6శాతం విదేశీ బొగ్గు ఉండాలని టార్గెట్‌ పెట్టింది. బొగ్గు కొనుగోలుకు అయ్యే వ్యయాన్ని చార్జీల రూపంలో రాబట్టుకోవాలని జెన్‌కోలకు ఆదేశాలు ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story