సిసోడియా కస్టడీ ముగింపు..మరికొన్ని రోజులు కస్టడి ఇవ్వాలంటోన్న సీబీఐ

సిసోడియా కస్టడీ ముగింపు..మరికొన్ని రోజులు కస్టడి ఇవ్వాలంటోన్న సీబీఐ
ఐదు రోజుల పాటు సీబీఐ ప్రశ్నల వర్షం, అన్ని ప్రశ్నలకు తనకేమి తెలియదన్న సిసోడియా

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా కస్టడీ ముగియడంతో ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు సీబీఐ అధికారులు. ఐదు రోజుల పాటు సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే అన్ని ప్రశ్నలకు తనకేమి తెలియదన్నారు సిసోడియా. సరైనా సమాధానాలు ఇవ్వకపోవడంతో మరిన్ని రోజులు కస్టడికి ఇవ్వాలని కోరనుంది సీబీఐ.

మరోవైపు శుక్రవారమే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు సిసోడియా. సీబీఐ దర్యాప్తునకు సహకరించానని ఇప్పటికే తన రికార్డులన్నీ సీబీఐ స్వాధీనం చేసుకుందని బెయిల్‌ పిటీషన్‌లో పేర్కొన్నారు. తన కస్టడీ కొనసాగింపుతో ఉపయోగం ఉండదని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టైన ఇతర నిందితులు సైతం ఇప్పటికే బెయిల్‌ పొందారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో మాగుంట రాఘవ, రాజేష్‌ జోషిల జుడిషియల్‌ కస్టడీ ముగిసింది. వీరి కేసులను సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించనుంది.

Tags

Read MoreRead Less
Next Story