నార్త్ ఈస్ట్ లో కొలువుదీరిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు

నార్త్ ఈస్ట్ లో కొలువుదీరిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు
X

మేఘాలయ, నాగాలాండ్‌లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు కొలువుదీరాయి. మేఘాలయ ముఖ్యమంత్రిగా రెండోసారి కాన్రాడ్‌ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సంగ్మాతో గవర్నర్‌ ఫాగు చౌహాన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. సంగ్మాతో పాటు 11మంది ఎమ్మెల్యేలు కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్‌పీపీకి చెందిన ఏడుగురు, యూడీపీకి చెందిన ఇద్దరు, బీజేపీ, హెచ్‌ఎస్‌పీడీసీ నుంచి ఒక్కొక్కరు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సోం సీఎం హిమంత బిశ్వశర్మ తదితరులు హాజరయ్యారు.

మరోవైపు నాగాలాండ్‌ సీఎంగా ఐదోసారి నెఫ్యూ రియో ప్రమాణస్వీకారం చేశారు. నాగాలాండ్‌లో బీజేపీకి డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యంతుంగో పాటన్‌ ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ లెజిస్లేచర్‌ పార్టీ పాటన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. యంతుంగో పాటన్‌తో పాటు, టీఆర్ జెలియాంగ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్‌డీపీపీకి చెందిన ఎమ్మెల్యే నాగాలాండ్ నుంచి మంత్రి పదవి పొందిన మొదటి మహిళా శాసనసభ్యురాలిగా క్రూస్‌ రికార్డ్‌ సృష్టించారు. క్రూస్‌ను ప్రధాని మోదీ అభినందించారు. అటు మేఘాలయ, ఇటు నాగాలాండ్‌లోఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మేఘాలయలో విడివిడిగా పోటీ చేసిన బీజేపీ, ఎన్‌పీపీ తరువాత పొత్తు పెట్టుకున్నాయి.

Next Story