మానాన్న నన్ను లైంగికంగా వేధించాడు: డీసీడబ్ల్యూ ఛీఫ్ స్వాతి

ఢిల్లీ మహిళా కమీషన్ ఛీఫ్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మలివాల్ తండ్రి తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నారు. ఆమె చిన్నతనంలో తన తండ్రి కొట్టి పందెం కాసేవాడని తెలిపారు. ఆ సమయాల్లో ఆమె మంచం కింద దాక్కున్నానని ఇప్పటికీ ఆ సంఘటన నాకు గుర్తుందని వెల్లడించారు. అతను జుట్టు పట్టుకొని లాగి గోడకు కొట్టేవాడని శనివారం ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్ వార్షిక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో స్వాతి మాలివాల్ చెప్పుకొచ్చారు. అయితే మంచం కింద దాక్కొని మహిళలు తమ హక్కులను సాధించుకోవడానికి నేను ఎలా సహాయం చేయాలో నిర్ణయించుకున్నాన్నారు. ఇలా మహిళలు, బాలికలపై దాడులు చేసేవారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆలోచించానని తెలిపారు. స్వాతి నాలుగో తరగతి వరకు తన తండ్రి వద్దే ఉండేదానినని, అప్పట్లో తన తండ్రి చాలాసార్లు దాడి చేశాడని పేర్కొన్నారు. కాగా ఇటీవలే ఖుష్బు సుందర్ కూడా తన తండ్రి ఆమె ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు లైంగికంగా వేధించాడని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com