వామ్మో నా భార్యతో వేగలేను.. మీరే న్యాయం చేయండి

అత్తింటి వేధింపులు భరించలేక, భర్తలు పెట్టె హింస తాలలేక పోలీసులకు ఫిర్యాదు చేసే భార్యలను తరుచూ చూస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇంటిని చక్కపెట్టాల్సిన ఇల్లాలే ఇంటిని మరిచి నిద్రపోతుంది. తన భార్య వైఖరి పట్ల విసిగి వేసారిన భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఆ కంప్లైంట్ చూసి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటన కర్నాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని బసవగూడకు చెందిన కమ్రాన్ ఖాన్‌కు కొన్నాళ్ల క్రితం ఆయేషా అనే మహిళతో వివాహమైంది.
అయితే పెళ్లైనప్పటి నుంచి తన భార్య ఎక్కువ సమయం నిద్రపోతూనే ఉంటుందని కమ్రాన్ పోలీసులకు వివరించాడు. రాత్రి పడుకుంటే మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిద్రపోతుందని వాపోయాడు. ఒకవేళ నిద్రలేపడానికి ప్రయత్నిస్తే తిడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. పగటి సమయంలో పడుకుంటే రాత్రి దాదాపు 10 గంటల వరకు నిద్రపోతూనే ఉంటుందని ఇలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకంటూ కమ్రాన్ ప్రశ్నించాడు. ఏ పని చేయడంలేదని, పని చేయమని అడిగితే చిరాకు పడుతుందని తెలిపాడు. ఇంట్లో అన్ని పనులు వయసు మీదపడ్డ తన తల్లే చేస్తుందని, వంట కూడా ఆవిడే చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com