మదర్సాలు కాదు పాఠశాలలు కావాలి : అస్సాం సీఎం హిమంత

నవ భారతానికి కావల్సింది మదర్సాలు కాదని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు అవసరమని అన్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... అస్సాంలో అన్ని మదర్సాలను మూసివేయనున్నట్లు తెలిపారు. కర్నాటకలోని బెలగావిలో జరిగిన బహిరంగ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ఇప్పటికే 600 మదర్సాలను మూసివేసినట్లు తెలిపారు. మిగిలినవి త్వరలోనే మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.
మాకు మదర్సాలు అవసరంలేదు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని అన్నారు శర్మ. మదర్సాల విషయంలో మీడియా ప్రతినిధులు శర్మను ప్రశ్నించినప్పుడు... నవ భారతానికి పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు అవసరమన్నారు. గతంలో మదర్సాలను తగ్గించడంతో పాటు అందులో బోధిస్తున్న విద్యను ప్రభుత్వాలు పరిశీలించాలని సూచించేవారు. అస్సాంలో ప్రస్తుతం 3000 నమోదిత మదర్సాలు ఉన్నట్లు తెలుస్తోంది.
2020లో ప్రభుత్వ మదర్సాలను... రెగ్యులర్ స్కూల్స్"గా మార్చడానికి చట్టాన్ని ప్రవేశపెట్టారు శర్మ. విద్య పట్ల సానుకూల దృక్పథం ఉన్న బెంగాలీ ముస్లింల సహాయంతో మదర్సాలలో మంచి వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. మదర్సాలలో సైన్స్, గణితం కూడా సబ్జెక్టులుగా బోధించబడుతున్నాయని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com