జమ్మూ కాశ్మీర్ లో బస్సు బోల్తా.. నలుగురు మృతి

జమ్మూ కాశ్మీర్ లో బస్సు బోల్తా.. నలుగురు మృతి
X

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో శనివారం రాత్రి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బీహార్ కు చెందిన నలుగురు మృతి చెందగా, 28 మందికి గాయాలయ్యాయి. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని బర్సూ ప్రాంతంలోని శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పటల్ కు తరలించారు. ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి లక్షరూపాలను అందిస్తున్నట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.25వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.10వేల సహాయాన్ని ప్రకటించారు.

Next Story