ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ అతిపెద్ద టీఆర్ఫీ : మమత

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ అతిపెద్ద టీఆర్ఫీ : మమత

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో వర్చువల్ గా మాట్లాడారు. ఈ మీటింట్ లో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రతిపక్ష నేతగా ప్రజలకు కనిపించినంతకాలం బీజేపీని ఎదుర్కోలేమని అన్నారు. ప్రధాని మోదీకి ‘అతిపెద్ద టీఆర్‌పీ’ రాహుల్ గాంధీయేనని చెప్పారు. కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలు తృణమూల్‌కు వ్యతిరేకంగా మైనారిటీలను రెచ్చగొడుతున్నాయని తెలిపారు. ముర్షిదాబాద్‌లోని పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆవిడ... ఇటీవల ముగిసిన ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు మైనార్టీ ప్రాబల్యం ఉన్న సీటును కోల్పోయిందని చెప్పారు. తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రతిపక్ష ముఖంగా ఉండటం వల్ల బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

ముర్షిదాబాద్‌లో కాంగ్రెస్‌పై తృణమూల్ ఓటమి పాలైనప్పటి నుంచి పరిస్థితులు మరింత దిగజారాయి. రెండు పార్టీలు ఇప్పుడు ఒకరినొకరు బీజేపీ తొత్తులంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. 2024లో బిజెపికి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ కోసం రెండు పార్టీల మధ్య బ్యాక్ ఛానల్ చర్చలు విఫలమయ్యాయి. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని బెనర్జీ ప్రకటించారు.

Next Story