కన్నడ నటుడు చేతన్‌ అహింస అరెస్ట్‌

కన్నడ నటుడు చేతన్‌ అహింస అరెస్ట్‌
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ట్విట్టర్‌లో పోస్ట్‌

కన్నడ నటుడు చేతన్‌ అహింసను మంగళవారం బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అతను ట్విట్టర్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారని మంగళవారం ఉదయం శేషాద్రిపురం పోలీసులు అదుపులోకి తీసుకొని జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే చేతన్‌ సోమవారం తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో హిందుత్వం అబద్ధాలపై నిర్మించబడిందని తెలుపుతూ ఓ ట్వీట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో అతనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రొడ్యూస్‌ చేశారు. ఇంతకు ముందు కూడా చేతన్‌ను 2022లో హిజాబ్‌ విషయంలో కర్ణాటక హైకోర్టు జడ్జీ కృష్ణ దక్షిత్‌ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా అరెస్ట్‌ అయ్యాడు.

Tags

Next Story