జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్... ఉగ్రవాది హతం

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్... ఉగ్రవాది హతం

దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన తీవ్రవాదిని భారత బలగాలు హతమార్చాయి. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుబెట్టిందని ఆర్మీ అధికారులు తెలిపారు. చొరబాటుదారుల కోసం సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాజౌరీ జిల్లా డాంగ్రీ గ్రామంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడి స్థానికులను చంపేశారని జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్‌బాగ్ సింగ్ తెలిపిన ఒక రోజు తర్వాత ఎన్ కౌంటర్ జరిగింది. చొరబాటు ప్రయత్నాలు తగ్గినప్పటికీ, ఉగ్రవాదులు మాత్రం అడపాదడపా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయన్నారు.

Next Story