ఈపీఎఫ్‌ నిల్వలపై వడ్డీరేటు నేడే ఖరారు

ఈపీఎఫ్‌ నిల్వలపై వడ్డీరేటు నేడే ఖరారు
2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీరేటునే కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం

ఈపీఎఫ్‌ ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఇవాళ (మంగళవారం) ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డీరేటునే కొనసాగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు సమావేశమవుతున్న ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ అజెండాలో వడ్డీరేటు ఖరారు ప్రధాన అంశంగా ఉంది. అయితే వడ్డీరేటు కొంత పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సోమవారం ప్రారంభమైన సీబీటీ సమావేశంలో కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాల ప్రతినిధులు, ట్రస్టీలు పలు అంశాలపై మాట్లాడారు. అధిక పింఛనుపై సుప్రీంకోర్టు తీర్పు అమల్లో భాగంగా ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు విషయమై ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల్లో పలు సందేహాలున్నాయని, వాటికి పరిష్కారం చూపించాలని కోరారు.

Tags

Next Story